అక్షరటుడే, వెబ్డెస్క్: Aadhaar Card | ఆధార్ కార్డు (Aadhaar Card ).. ప్రస్తుతం ప్రతి భారతీయుడి జీవితంలో ఒక భాగం. ఆధార్ ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయి. ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ తప్పనిసరి. ప్రతి దరఖాస్తు సమయంలో ఆధార్ నంబర్ ఇవ్వాల్సిందే. పుట్టిన పిల్లలకు ప్రస్తుతం బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా ఆధార్ జారీ చేస్తున్నారు. బాల ఆధార్ పేరిట వీటిని అందిస్తున్నారు. అయితే చిన్నారులకు ఆధార్ కార్డు జారీ చేసే సమయంలో వారి వేలిముద్రలు, ఐరీష్ నమోదు చేయడం లేదు.
Aadhaar Card | బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలి
ప్రస్తుతం చిన్నారులకు బయోమెట్రిక్ (Bio Metric) లేకుండానే ఆధార్ కార్డు ఇస్తున్నారు. పిల్లలకు ఐదేళ్లు వచ్చిన తర్వాత వేలిముద్రలు అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే కొంతమంది అప్‌డేట్ చేయించకుండా ఆలస్యం చేస్తున్నారు. అలాంటి వారికి ఆధార్ కార్డులు జారీ చేసే యూఐడీఏఐ (UIDAI) కీలక సూచనలు చేసింది. ఏడేళ్లు దాటిన చిన్నారులకు ఆధార్ బయోమెట్రిక్ వివరాలు వెంటనే అప్‌డేట్ చేయాలని పేర్కొంది. లేదంటే ఆధార్ కార్డు డియాక్టివేట్ అవుతుందని హెచ్చరించింది. ఐదేళ్లు నిండిన పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏడేళ్లు నిండిన వారికి వెంటనే అప్‌డేట్ చేయించాలని తల్లిదండ్రులకు యూఐడీఐఏ సూచించింది.