అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sheep scam | తెలంగాణ Telanganaలో జరిగిన గొర్రెల స్కామ్ Sheep scam కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన దళారి మొయినుద్దీన్‌ను moinuddin ఏసీబీ అధికారులు acb officers అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ brs హయాంలో రాష్ట్రంలో గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా లబ్ధిదారులు కొంత మొత్తం చెల్లిస్తే.. ప్రభుత్వం మిగతా డబ్బులు చెల్లించి గొర్రెలను పంపిణీ చేసింది. అయితే ఇందులో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.
Sheep scam | కీలక అధికారుల హస్తం..
గొర్రెల పంపిణీ స్కామ్‌లో పశుసంవర్ధక శాఖ Animal Husbandry Department ఉన్నత అధికారుల హస్తం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కేసు ఏసీబీకి అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే 17మంది అరెస్టయ్యారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ talasani srinivas yadav ఓఎస్డీ కళ్యాణ్, గొర్రెల మేకల పెంపకం సమైక్య మాజీ ఎండీ రామచందర్ నాయక్, పలువురు వెటర్నరీ అధికారులు ఈ కేసులో ఉన్నారు. అయితే ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన దళారీ మొయినుద్దీన్ అదుపులోకి తీసుకునేలోపే దుబాయి పారిపోయారు.
Sheep scam | దుబాయి నుంచి రాగానే..
గొర్రెల స్కామ్‌ను సవాల్‌గా తీసుకున్న ఏసీబీ ఇప్పటికే పలువురు పశుసంవర్ధక శాఖ అధికారులను విచారించింది. ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ moinudiin ఇంట్లో గురువారం తనిఖీలు raids నిర్వహించింది. దుబాయిలో ఉన్న ఆయనపై గతంలోనే ఎల్వోసీ Loc issue కూడా జారీ చేసింది.
ఈ క్రమంలో దుబాయి నుంచి శుక్రవారం మొయినుద్దీన్ హైదరాబాద్ రాగానే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టరుగా వ్యవహరించిన మొయినుద్దీన్ కీలకంగా వ్యవహరించాడు. కాగా.. ఈ స్కామ్‌లో రూ.700 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. దళారీ మొయినుద్దీన్‌ను విచారిస్తే మరికొంత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.