అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Liquor Scam | ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ AP Liquor Scam కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి Raj Kasireddyని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్సీపీ YSRCP హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తునకు సిట్ liquor case sit కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి ఇన్నిరోజులుగా పరారీలో ఉన్నారు.
ఇప్పటికే సిట్ SIT ఆయనకు మూడుసార్లు నోటీసులు పంపినా విచారణకు హాజరు కాలేదు. దీంతో గతంలో హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు చేశారు. అనంతరం మాజీ ఎంపీలు విజయిసాయి రెడ్డి Mp vijaya sai reddy, మిథున్‌రెడ్డి mithun reddyని లిక్కర్ స్కామ్ కేసులో విచారించారు.
పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి సోమవారం దుబాయి నుంచి హైదరాబాద్ Hyderabad రాగా.. ఏపీ పోలీసులు ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆయన ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.