అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jal Shakti meeting | జల వివాదాలపై కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జల వివాదాల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 21లోగా కమిటీ ఏర్పాటు చేయనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జలశక్తి సమావేశం (Central Jal Shakti meeting) జరిగింది. ఇందులో భాగంగా సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) , ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో (Andhra Pradesh CM Chandrababu Naidu) పాటు రెండు రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. సమావేశం సుమారు గంటన్నర పాటు సాగింది.
Jal Shakti meeting | 13 అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన తెలంగాణ
సమావేశం సందర్భంగా 13 అంశాలను కేంద్రం దృష్టకి తెలంగాణ తీసుకెళ్లింది. గోదావరి, కృష్ణా జలాల (Godavari and Krishna waters) పంపకాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో రెండు నదుల జలాల వివాదాల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కమిటీ ద్వారా సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ రూపొందించనున్నారు. హైదరాబాద్లో గోదావరి నది నిర్వహణ బోర్డు, అమరావతిలో కృష్ణా నది నిర్వహణ బోర్డు ఏర్పాటు చేయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా ముందుకు వెళ్లాలని కేంద్రం ఆధ్వర్యంలో నిర్ణయం జరిగిందని నిమ్మల తెలిపారు.
Jal Shakti meeting | బనకచర్ల కడతామని ఏపీ చెప్పలేదు
సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణంలో చర్చ జరిగిందని తెలిపారు. గోదావరి, కృష్ణాల జలాల వివాదాల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్రం ఎవరి పక్షాన మాట్లాడలేదని చెప్పారు. నదీ జలాల సమస్యపై రెండు రాష్ట్రాల మధ్య చర్చల స్థాయికి రావడం తెలంగాణ విజయమని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రులు జరిపిన చర్యలు అమలు కాలేదన్నారు. ఇప్పడు పరిష్కారం కోసం చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాగా.. బనకచర్చ ప్రాజెక్టుపై (Banakacharcha project) సీఎం రేవంత్ స్పందించారు. నేడు జరిగిన సమావేశంలో బనకచర్లపై చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును కడతామని ఏపీ చెప్పలేదన్నారు. బనకచర్లపై మేము గతంలోనే ఫిర్యాదు చేశామని వ్యాఖ్యానించారు. కాగా.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలే బనకచర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయని చెప్పారు.