అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Land Market Values | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు (Stamp Amendment Bill)ను తీసుకు రానుంది. దీంతో భూముల ధరలు పెరగనున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువల (Markett Values) కు అనుగుణంగా భూముల ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti) సూచించారు.
Land Market Values | మహిళలకు గుడ్‌న్యూస్
ఇళ్లు, ఆస్తులు రిజిస్ట్రేషన్లు చేసుకునే మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. భూముల ధరలు పెంపునకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్లలో మహిళలకు డ్యూటీ తగ్గించాలని నిర్ణయించింది. కొత్త సవణ బిల్లు అమలులోకి వస్తే స్టాంప్ డ్యూటీ (Stamp Duty) 6 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ సమయంలో ఆస్తి విలువలో 0.5శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తారని తెలిసింది. ఆస్తి ఇతరుల పేరిట బదిలీ చేసినప్పుడు సైతం సుంకం విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Land Market Values | గతంలోనే ప్రయత్నాలు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూముల ధరలు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కమిటీని కూడా వేసింది. ప్రస్తుత మార్కెట్ విలువకు స్టాంప్ డ్యూటీ శాఖ పొందుపరిచిన విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఈ క్రమంలో రేట్లు సవరించాలని గతంలో భావించిన ప్రభుత్వం తర్వాత అనివార్య కారణాలతో వెనక్కి తగ్గింది. తాజాగా భూముల ధరలను సవరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఎంత మేర పెంపు ఉంటుందనే విషయమై స్పష్టత లేదు.