అక్షరటుడే, హైదరాబాద్: tenth grade memos : పదో తరగతి మెమోల్లో tenth memos ఈసారి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈసారి అందులోనే సబ్జెక్టులవారీగా మార్కులు subject wise marks, గ్రేడ్లు grading ఇవ్వబోతున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా education secretary yogita rana తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.
పాఠశాల విద్యాశాఖ school education department నుంచి ఈ నెల 8న ప్రతిపాదన పంపగా.. దాదాపు 20 రోజులకు తుది నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇచ్చారు. పదో తరగతిలో ఇప్పటిదాకా సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు.. క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ (సీజీపీఏ) ఇచ్చేవారు. ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఇకపై జీపీఏ ఇవ్వరు.
కాగా.. పదో తరగతి ఫలితాలు tenth result త్వరలో విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మార్కుల రూపంలో ఫలితాలు విడుదల చేయనున్న నేపథ్యంలో.. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల మధ్య పోటీ నెలకొనుంది.