అక్షరటుడే, వెబ్‌డెస్క్: Keeravani : ఆస్కార్ అవార్డ్ విజేత(Oscar award winner), ప్రముఖ సంగీత దర్శకుడు(music director) కీరవాణి Keeravani తండ్రి శివ శక్తి దత్తా(Shiva Shakti Dutta) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. వయోభారం కారణంగా ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది.
శివ శక్తి దత్తా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఎంఎం కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా తెలుగులో సుప్రసిద్ద పాటల రచయిత.. ఆయన సినిమా కథకుడు కూడా. శివ శక్తి దత్తా చిత్రలేఖనం చాలా ఫేమస్.
Keeravani : నివాళులు..
ఆయన Shiva Shakti Dutta ప్రతిభకి బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మంత్ర ముగ్దుడయ్యారు. ఒకానొక సమయంలో అనుపమ్ ఖేర్ (Anupam Kher) ఓ వీడియో షేర్ చేయగా, అందులో చూపించిన విజువల్స్, దేవుళ్ల చిత్రపటాలు చూసి అంతా అవాక్కయ్యారు. ఇంత అద్భుతంగా ఎలా గీశారంటూ శివ శక్తి దత్తా టాలెంట్ పట్ల నెటిజన్స్ ప్రశంసలు కురిపించారు. 92 ఏళ్ల వయస్సులో కూడా ఆయన అద్భుతంగా ఆర్ట్ వేయడం గ్రేట్ అని చాలా మంది ప్రశంసలు కురిపించారు.
92 ఏళ్ల వయసులోనూ శివ శక్తి దత్తా పని చేస్తూనే వచ్చారు. పెయింటింగ్‌లు వేయడంతో పాటు అడపాదడపా పాటలు రాసేవారు. చిరంజీవి వశిష్ట కాంబో (Chiranjeevi-Vashishtha combo)లో రూపొందిన విశ్వంభర Vishwambara సినిమా కోసం కూడా ఈయన పాట రాసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎంతో ప్రతిభ ఉన్న శివ శక్తి దత్తా తన కుమారుడి ఎదుగుదల చూసి చాలా మురిసిపోయారు. ఆయనకి ఆస్కార్ వచ్చినప్పుడు చాలా సంబరపడ్డారు. ఆయన ఇలా మరణించడం సినీ పరిశ్రమకి తీరని విషాదం అని పలువురు కామెంట్ చేస్తున్నారు.