అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRS Chief KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) మరోసారి సోమాజిగూడ యశోద ఆస్పత్రి(Somajiguda Yashoda Hospital)కి వెళ్లారు. ఇటీవల ఆయన స్వల్ప అస్వస్థతకు గురికాగా యశోద ఆస్పత్రిలో చికిత్ పొందిన విషయం తెలిసిందే. ఈ నెల 3న కేసీఆర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వైద్యుల సూచన మేరకు రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్న ఆయన 5న డిశ్చార్జి అయ్యారు.
వారం రోజుల విశ్రాంతి అనంతరం మరోసారి పరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో గురువారం ఆయన మరోసారి యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్(Former Ministers KTR), హరీశ్‌రావు(Harish Rao) ఉన్నారు.