అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy) అరెస్ట్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. శనివారం ఆయన సంగారెడ్డి జిల్లా జిన్నారంలో చేపట్టిన రైతు మహాధర్నాలో మాట్లాడారు. హైకోర్టు(High Court) తిట్టినా సీఎం రేవంత్‌రెడ్డి బుద్ధి మారడం లేదన్నారు. శనివారమని చూసి.. కావాలనే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై కౌశిక్‌రెడ్డి ప్రశ్నిస్తుండడంతో పగబట్టి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని అడగడంతో తప్పులు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. నాన్‌బెయిలబుల్(Non-bailable) కేసులు పెట్టారని ఆయన అన్నారు.
Harish Rao | కోతల రేవంత్‌రెడ్డి
సీఎం పేరు ఎనుముల రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కాదని.. కోతల రేవంత్‌రెడ్డి అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆయన ప్రతి పథకంలో కోతలు పెడుతున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ(Rythu Runamafi) పూర్తిస్థాయిలో చేయలేదన్నారు. రెండు విడతల రైతు భరోసా(Rythu Bharosa) ఇవ్వలేదన్నారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి పరిమితి లేకుండా రైతు బంధు ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి అబద్ధాల సీఎం అని వ్యాఖ్యానించారు.