అక్షరటుడే, వెబ్డెస్క్: Kashmir | కశ్మీర్ అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది మంచుతో కప్పిన పర్వతాలు, పచ్చని లోయలు, ఆహ్లాదకరమైన వాతావరణం. అయితే, ఈ ప్రకృతి రమణీయత మధ్య నివసించే యువత తమ సృజనాత్మకతను వినూత్నంగా వినియోగిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
తాజాగా, కొండల మధ్య క్రికెట్ ఆడుతూ బంతి లోయలో పడకుండా అడ్డుకోవడానికి కాశ్మీరీ యువకులు (Kashmiri youth) ఉపయోగించిన చిట్కా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో కశ్మీర్‌లోని ఎత్తయిన కొండపై కొంతమంది యువకులు ఉత్సాహంగా క్రికెట్ (Cricket) ఆడుతున్నారు.
Kashmir | భలే ఐడియా..
ఆ ప్రదేశం ఒకవైపు మైదానం లాగా కనిపిస్తే, మరొకవైపు మాత్రం భయంకరమైన లోయ ఉంది. అటువంటి చోట బంతి పక్కదారి పట్టినా దాన్ని తిరిగి తేవడం అసాధ్యం. అయితే, ఈ యువకులు సమస్యకు చురుకైన పరిష్కారాన్ని కనిపెట్టారు. బంతి లోయలో పడకుండా అడ్డుకునేందుకు వారు ఒక పొడవైన, బలమైన తాడును బంతి(Ball)కి కట్టారు. బ్యాట్స్‌మన్ బంతిని కొట్టినప్పుడు, అది లోయ వైపు వెళ్లినా.. తాడు కారణంగా అక్కడే ఆగిపోతుంది. వీడియోలో కూడా బంతి వేగంగా వెళ్లి తాడుతోనే తిరిగి వారి వద్దకు వచ్చిందనేది స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ వీడియో(Video) చూసిన వారంతా ఆ కుర్రాళ్ల తెలివిని, క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు.”ఇదే నిజమైన ఇన్నోవేషన్! (Innovation) , పరిస్థితులని జయించాలంటే ఇలాంటి ఆలోచనే అవసరం , బంతిని తాడుతో కట్టడం అంటే.. గేమ్ ఆన్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో కేవలం వినోదాన్ని కలిగించడమే కాదు, సమస్యలను ఎలా మానసికంగా ఎదుర్కోవాలో కూడా చక్కగా చూపిస్తుంది. ప్రకృతి సవాళ్లను ఆటలో కలపడం, ఆ ఆటను విరామం లేకుండా కొనసాగించేందుకు తీసుకున్న చొరవ నిజంగా ప్రశంసనీయం. ఇంతకీ బంతి తాడుతో కట్టడం అనేది క్రీడా నిబంధనలలో లేని అంశం అయిన, ఆ కుర్రాళ్లు చూపిన ఆలోచనా శక్తి మాత్రం నిజంగా స్ఫూర్తిదాయకం.