అక్షరటుడే, వెబ్‌డెస్క్: Karun Nair | ఇప్పుడు టీమిండియాలో చాలా మంది ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వెంటనే వేరే ప్లేయర్‌కు ఛాన్స్ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్(Karun Nair) 8 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత టెస్ట్ టీమ్(Indian Test team)లోకి పునరాగమనం చేశాడు. అయినా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో అతను 0, 20 పరుగులతో నిరాశపరిచాడు. రెండో టెస్ట్‌లో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కరుణ్ నాయర్ మరోసారి నిరాశ పరిచాడు. 50 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు సాధించిన కరుణ్, బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
Karun Nair | నెక్స్ట్ మ్యాచ్ కష్టమే..
ఇక రెండో ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్(26) చేసి ఔటయ్యాడు. వరుసగా రెండు ఫోర్లు బాదిన కరుణ్.. చివరి బంతిని స్ట్రెయిట్ డ్రైవ్ ఆడబోగా, అది ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ జేమీ స్మిత్ చేతిలో పడింది. దాంతో 96 వద్ద టీమిండియా (Team India) రెండో వికెట్ పడింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (55) బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(13)కి జతగా పంత్ (0) క్రీజులో ఉన్నాడు. ఇప్పటికైతే టీమిండియా 306 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 407కే ఆలౌట్ చేసి.. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలని చూస్తుంది. మూడోరోజు ఓపెనర్ యశస్వీ జైస్వాల్(26) బౌండరీలతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ మాత్రం క్లాస్ బ్యాటింగ్ ఇంగ్లండ్ బౌలర్స్ సహనాన్ని పరీక్షించాడు.
అయితే వరుస వైఫల్యాల వలన నెటిజన్లు కరుణ్ నాయర్‌పై తీవ్రం విమర్శలు చేస్తున్నారు “ఒక్క ఛాన్స్ అంటూ పోస్ట్ పెట్టిన కరుణ్ నాలుగు అవకాశాలను వృథా చేశాడు” అని సెటైర్లు పేలుస్తున్నారు. 2017లో ధర్మశాల వేదికపై ఆస్ట్రేలియా(Australia)తో ఆడిన తర్వాత, కరుణ్ నాయర్ 2016లో ఇంగ్లండ్‌తో మొహాలీ వేదికపై టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అదే సిరీస్‌లో చెన్నై వేదికపై జరిగిన ఐదవ టెస్ట్‌లో 303 నాటౌట్ (ట్రిపుల్ సెంచరీ) సాధించి, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. ఆ తరువాత కరుణ్ నాయర్, జట్టుకు దూరమయ్యాడు. ఇన్నేళ్ల తర్వాత తనకు వచ్చిన అవకాశాలను కరుణ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చూస్తుంటే మూడో టెస్ట్‌లో కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్(Sai Sudarshan)ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.