అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram Project : కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఈ తెల్లవారుజాము నుంచి ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ షేక్‌పేట ఆదిత్య టవర్స్ లోని ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగించి, కాళేశ్వరం ఏజెన్సీకి రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
హరిరామ్ కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా హరిరామ్ పనిచేస్తున్నారు. కాళేశ్వరం అనుమతులు, రుణాల్లో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. హరిరామ్ భార్య అనిత నీటిపారుదల శాఖ Irrigation Department లో డిప్యూటీ ఈఎన్సీగా పనిచేస్తున్నారు.
కాళేశ్వరం ఏజెన్సీ Kaleshwaram Agency కి భారీ ఆస్తులు గుర్తించిన ఏసీబీ.. కాళేశ్వరం ENC హరిరామ్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. గజ్వేల్‌లోనూ చట్టవిరుద్ధమైన భారీ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ENC హరిరామ్, అతని బంధువుల ఇళ్లల్లోని 13 చోట్ల ఈ రోజు ఏసీబీ సోదాలు కొనసాగాయి.