అక్షరటుడే, ఇందూరు: BC Reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో అమలు చేసినప్పుడే న్యాయం జరుగుతుందని జాతీయ బీసీ విద్యార్థి సంఘం (National BC Student Union) జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ తెలిపారు.
రోడ్లు భవనాల శాఖ గెస్ట్ హౌస్లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40ఏళ్ల నుంచి బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (BC National President R.Krishnaiah) అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ‘మేమెంతో మాకు అంతే అనే నినాదంతో పోరాటం చేశారన్నారు.
BC Reservations | పోరాటాల ఫలితమే..
దీని ఫలితమే స్థానిక సంస్థల్లో (local body Elections) 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఐకమత్యంతో బీసీలను గెలిపించుకున్నప్పుడే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు విఠల్, గణేష్ యాదవ్, అఖిల్, రమేష్, జనార్దన్, శేఖర్, శ్రీను, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.