అక్షరటుడే, వెబ్‌డెస్క్: Judgment : షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి మతం మారితే కులం వర్తించదని అట్రాసిటీ కేసు చెల్లదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ap high court స్పష్టం చేసింది. బాపట్ల జిల్లా bapatla district పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి చర్చి పాస్టర్ గా జీవనం సాగిస్తున్నారు.
కాగా, చర్చి నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అక్కల రామిరెడ్డి, మరికొంత మందిపై చింతాడ ఆనంద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ sc st atrocities act కేసు పెట్టారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ అక్కల రామిరెడ్డి, ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం.. మతం మారిన ఎస్సీ వ్యక్తి హిందువు కాలేడని, అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని తీర్పునిచ్చింది.