అక్షరటుడే, వెబ్‌డెస్క్:Telangana University | తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ యూనివర్సిటీలో telangana university పార్ట్‌టైం అధ్యాపకులు(Part-time teachers) డిమాండ్ చేశారు. ఈ మేరకు వర్సిటీ సౌత్ క్యాంపస్(university South Campus)లో మంగళవారం ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్‌కు వారు నిరవధిక సమ్మె నోటీస్(strike notice) అందించారు.
అనంతరం అధ్యాపకుడు పోతన్న మాట్లాడుతూ.. పార్ట్‌టైం అధ్యాపకులకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అధ్యాపకులకు మినిమం టైంస్కేల్(Minimum timescale for lecturers) ఇవ్వాలని, జీవో నెంబర్.21ను సవరించి తమ సర్వీసులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. రెగ్యులర్ నోటిఫికేషన్లో తమకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొదటి రోజు సమ్మెకు విద్యార్థులు(Students) సైతం సంఘీభావం తెలిపారు.