అక్షరటుడే, వెబ్‌డెస్క్:Jio Hotstar | జియో హాట్‌స్టార్ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన జాబితాలో రెండో స్థానంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) అగ్రస్థానంలో కొనసాగుతోంది. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం అయి జియో హాట్‌స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. 2025 ఫిబ్రవరి 14న జియో హాట్‌స్టార్ ప్రారంభమైంది. ఆ సమయంలో 50 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉండగా.. తాజాగా 280 మిలియన్లకు చేరడం గమనార్హం.
Jio Hotstar | అగ్రస్థానంలో నెట్‌ఫ్లిక్స్
అమెరికాకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక యూజర్లను కలిగి ఉంది. ఈ ఓటీటీకి 300 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు(300 million subscribers) ఉన్నారు. జియో హాట్‌స్టార్ 280 మిలియన్ల వినియోగదారులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో మరికొద్ది రోజుల్లో జియో హాట్‌స్టార్ అగ్రస్థానంలోకి చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
Jio Hotstar | ఐపీఎల్‌తో పెరిగిన యూజర్లు
భారత్‌లో ఐపీఎల్(IPL)కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. భారత్‌తో పాటు విదేశాల్లో సైతం ఐపీఎల్ మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలో జియో హాట్‌స్టార్ ఐపీఎల్ ఓటీటీ రైట్స్ దక్కించుకుంది. అంతేగాకుండా ICC ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy), ఐపీఎల్ హక్కులు దక్కించుకోవడంతో జియో హాట్‌స్టార్ బాగా కలిసి వచ్చింది. క్రికెట్ ప్రేమికులు సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ యూజర్లు ఒక్కసారిగా భారీగా పెరిగారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌ను ఏకకాలంలో 61 మిలియన్ల మంది వీక్షించారంటే అర్థం చేసుకోవచ్చు.
Jio Hotstar | కంటెంట్‌లోనూ రారాజు..
జియో హాట్‌స్టార్ మొత్తం 320,000 గంటల కంటెంట్‌ను కలిగి ఉంది. ఇందులో డిస్నీ, హెచ్‌బీవో, వార్నర్ బ్రదర్స్, NBC Universal, Peacock మరియు Paramount వంటి గ్లోబల్ స్టూడియోల నుంచి 250 ఒరిజినల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరియు తక్కువ ధరకు సబ్స్క్రిప్షన్ అందిస్తోంది. మొబైల్ యూజర్లకు రూ.149కే మూడు నెలల సబ్స్క్రిప్షన్ అందిస్తోంది. తక్కువ ధరకు సబ్స్క్రిప్షన్ లభించడం కూడా యూజర్లు పెరగడానికి ఒక కారణం.
Jio Hotstar | మూడో స్థానంలో అమెజాన్ ప్రైమ్
ప్రపంచ వ్యాప్తంగా 300 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో నెట్‌ఫ్లిక్స్ (Netflix) అగ్రస్థానంలో ఉండగా, 280 మిలియన్లతో జియో హాట్‌స్టార్ (Jio Hotstar) సెకండ్ ప్లేస్‌లో ఉంది. అమెజాన్ ప్రైమ్ 200 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇండియాయాలో నెట్‌ఫ్లిక్స్ 15 మిలియన్ల మంది ప్రైమ్ వీడియోకు 25 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు సమాచారం.