అక్షరటుడే, వెబ్‌డెస్క్: Janu Liri | ప్రముఖ డ్యాన్సర్, ఢీ షో ఫేమ్ జాను లిరి ఇందూరులో సందడి చేసింది. నగరంలోని ఓ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల (hotel management college) ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ఆమెను చూసేందుకు పలువురు అభిమానులు తరలివచ్చారు.
Janu Liri | ఫోక్ సాంగ్స్ డ్యాన్సర్‌గా..
జాను లిరి ఫోక్ సాంగ్స్ డ్యాన్సర్‌గా (folk songs dancer Janu Liri) సుపరిచితురాలు. అనేక ఫేమస్ పాటల్లో డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. ఆమె డ్యాన్స్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాగే ఆమె ఢీ షోలోనూ తన ప్రతిభ కనబర్చింది. జాను లిరి సోషల్ మీడియాలోనూ (Social Media) ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటుంది.
Janu Liri | ఢీ డ్యాన్సింగ్ షోతో స్టార్ డం
తెలుగులోని ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమయ్యే ఢీ అనే డ్యాన్స్ షోతో (Dhee dance show) జాను లిరి స్టార్ డం సంపాదించింది. ఈ షోలో ఎంతోమందిని వెనక్కినెట్టి విజేతగా నిలిచింది. ఈ షోతో స్టార్‌గా మారిపోయిన ఈమె.. పాటలు, డ్యాన్సులతో సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేసి సెలబ్రెటీగా మారింది. కాగా.. ఇటీవలే ఆమె సింగర్ దిలీప్ దేవగన్‌ను (singer Dilip Devgan) రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.