అక్షరటుడే, వెబ్‌డెస్క్: Big movie heroine | అందాల ముద్దుగుమ్మ అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సినిమాలతో పాటు తన అంద చందాలతోను అదరగొడుతూ ఉంటుంది. సామాజిక సమస్యల మీద కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటుంది జాన్వి. తాజాగా మద్యం తాగి వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలను తీస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జాన్వీ కపూర్(Janhvi Kapoor). జైపూర్‌లో మద్యం సేవించిన ఓ మహిళ వేగంగా కారు నడిపి, ఓ బైక్ ని వెనక నుండి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ మీద ప్రయాణిస్తున్న ఓ చిన్నారి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలు అయినట్టు సమాచారం.. ఈ ప్రమాదం జాన్వీ కపూర్ దృష్టికి వెళ్లగా, వెంటనే దానిపై సోషల్ మీడియా(Social media) వేదికగా స్పందించారు.
Peddi movie heroine | జాన్వీ సీరియస్..
ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తన ఎవరికైన సమ్మతం అనిపిస్తుందా? మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా చుట్టూ ఉన్నవారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. మద్యం కారణంగా జరిగే ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది గాయాలపాలు అవుతున్నారు. చట్టాలను మనం ఎందుకు పాటించడం లేదు. కనీస అవగాహన లేకుండా చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం అంటూ జాన్వీ కపూర్ గట్టిగానే ఇచ్చి పడేసింది. దయచేసి ఎవరు కూడా మద్యం తాగి వాహనాలు నడపొద్దంటూ కోరుతుంది.
ఇక శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్(Janhvi Kapoor)కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కింది. ఇక ప్రస్తుతం తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకునేందుకు ఈ అమ్మడు ప్రయత్నిస్తుంది. తనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటూ నటిగా ప్రశంసలు పొందుతుంది. ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటించి అదరగొట్టిన జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇప్పుడు పెద్ది చిత్రం(Peddi Movie)లో రామ్ చరణ్ సరసన జత కట్టింది. ఈ మూవీ జాన్వీ కపూర్‌కి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే అవకాశం ఉంది.