అక్షరటుడే, వెబ్‌డెస్క్:Jaishankar | చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం సమావేశమయ్యారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న ఆయన.. బీజింగ్‌లో జిన్ పింగ్(Jinping)ను కలిశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తరఫున జిన్‌పింగ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై చర్చించారు.
భారత-చైనా ద్వైపాక్షిక సంబంధాలలో పరిణామాలపై జిన్‌పింగ్‌కు వివరించినట్లు జైశంకర్ చెప్పారు. ఇండియా, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధంలో ఇటీవలి పరిణామాలను కూడా ఆయన వివరించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు రెండు దేశాల అగ్ర నాయకత్వం మార్గదర్శకత్వం వహించాలని చెప్పారు. “ఈ ఉదయం బీజింగ్‌లో అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ను సహచర SCO విదేశాంగ మంత్రులతో కలిసి కలిశాను. అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి తరఫున శుభాకాంక్షలు తెలియజేశాను. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి గురించి అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వివరించాను. ఆ విషయంలో మా నాయకుల మార్గదర్శకత్వాన్ని విలువైనదిగా భావిస్తున్నాను” అని జైశంకర్(Jaishankar) Xలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
Jaishankar | సంబంధాల బలోపేతం దిశగా..
గల్వాన్ ఉదంతం తర్వాత ఇండియా, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా దెబ్బ తిన్నాయి. ఉద్రిక్త పరిస్థుతులను చల్లార్చడానికి రెండు దేశాల మధ్య వివిధ స్థాయిల్లో చర్చలు జరుగుతున్నాయి. షాంఘై సహకార సంస్థ (Shanghai Cooperation Organization) సమావేశంలో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం బీజింగ్(Beijing)కు వెళ్లారు.
2020 జూన్‌లో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా క్షీణించిన తర్వాత ఆయన ఆ దేశానికి రావడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే జైశంకర్ చైనా(China) పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ఆయన దౌత్యం నెరుపుతున్నారు. చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌తో చర్చలు జరిపిన జైశంకర్ తర్వాతి రోజు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, పరస్పర సహకారాన్ని విస్తరించాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.
Jaishankar | అజ్ఞాతం వీడి..
మరోవైపు కొంతకాలంగా అదృశ్యమైన చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ చాలా రోజుల తర్వాత బయట ప్రపంచానికి కనిపించారు. ఆయన కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. అధికారిక సమావేశాల్లోనూ కనిపించలేదు. ఏకపక్ష వైఖరి అవలంభిస్తున్న జిన్‌పింగ్ పై చైనా కమ్యూనిస్టు పార్టీ(Communist Party) కేంద్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది.
ఈ నేపథ్యంలోనే ఆయన అధికారాలకు కత్తెర వేస్తోందని, జిన్‌పింగ్‌ను తప్పించే ప్రయత్నం జరుగుతోందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి బలం చేకూర్చుతూ జిన్‌పింగ్ కొద్దికాలం అదృశ్యమై పోయారు. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. దీంతో జిన్‌పింగ్ ప్రాభవం ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.