ePaper
More
    Homeఅంతర్జాతీయంUS ISKCON temple | అమెరికాలోని ఇస్కాన్ ఆలయంపై కాల్పులు.. తీవ్రంగా ప‌రిగణించిన భార‌త్

    US ISKCON temple | అమెరికాలోని ఇస్కాన్ ఆలయంపై కాల్పులు.. తీవ్రంగా ప‌రిగణించిన భార‌త్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US ISKCON temple : అమెరికాలోని America ఇస్కాన్ ఆలయంపై కాల్పులు జరగడం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. గతంలో బంగ్లాదేశ్‌ Bangladesh లో ఇస్కాన్ ఆలయంపై దాడులు జరగడం, చిన్మయ్ కృష్ణదాస్‌ (Chinmay Krishnadas) ను అరెస్ట్ చేయడం వంటి సంఘటనలు హిందూ సమాజాన్ని కలిచివేశాయి.

    ఇప్పుడు అమెరికాలో ఇస్కాన్ ఆలయంపై కాల్పులు జరగడం ఉద్రేకానికి దారి తీసింది. అమెరికాలోని ఉతాహ్ Utah రాష్ట్రం, స్పానిష్ ఫోర్క్Spanish Fork ప్రాంతంలో ఉన్న శ్రీశ్రీ రాధా కృష్ణ ఇస్కాన్ దేవాలయంపై కొందరు దుండగులు రాత్రివేళ కాల్పులు జరిపారు. భక్తులతో పాటు అతిథులు ఆలయంలోనే ఉన్న సమయంలో ఈ దాడి జరగడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

    US ISKCON temple : భార‌త్ సీరియ‌స్..

    ఈ ఘటనలో గోడలపైకి, కిటికీలపైకి 20-30 బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆలయ నిర్మాణానికి గణనీయమైన నష్టం వాటిల్లింది. గత నెలలో ఇప్పటికే మూడు సార్లు ఇలాంటి దాడులు జరిగినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసన ప్రకటించింది.

    READ ALSO  Operation Sindoor | రాఫెల్ జెట్ల కూల్చివేతపై పాక్ ఆరోపణలు అవాస్తవం.. స్పష్టం చేసిన డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్

    శాన్ ఫ్రాన్సిస్కో San Francisco లోని భారత కాన్సులేట్ జనరల్ ఒక అధికారిక ప్రకటన చేస్తూ.. ఇస్కాన్ Iscon ఆలయంపై జరిగిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భక్తులు, ఆలయ నిర్వాహకులకు మద్దతుగా ఉంటాం.. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులను కోరుతున్నాం.. అని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’ లో ఓ పోస్ట్ చేశారు.

    హోలీ వేడుకల Holi celebrations సమయంలో కూడా విద్వేషపూరిత దాడి జ‌రిగింది. ఈ ఇస్కాన్ ఆలయం హోలీ Holi వేడుకలకు ప్రసిద్ధి. ఆలయంలో ఏడాది పొడ‌వున‌ పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారు.

    ఆలయ అధ్యక్షుడు వాయ్ వార్డెన్ Vai Warden మాట్లాడుతూ..“గత కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆలయం శాంతియుతంగా కొనసాగుతోంది. కానీ, ఇటీవల మూడుసార్లు ఇలాగే కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. స్వాగత ద్వారాలు, గోడలు, కిటికీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు.

    READ ALSO  Nagpur Railway Station | నడుస్తున్న రైలులో ఎక్కేందుకు యత్నించి పడిపోయిన యువతి.. ప్రాణాలు కాపాడిన పోలీస్​..

    ఈ ఆలయం 1990లో నిర్మించబడింది. అప్పటి నుంచి ఇది స్థానిక హిందూ సంఘానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఇస్కాన్ ఆలయంపై జరుగుతున్న దాడుల సంఘటనలు కేవలం సంప్రదాయాలపైనే కాదు, విద్వేషానికి ప్రతీకగా మారుతున్నాయి.

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this