అక్షరటుడే, వెబ్‌డెస్క్ :IPO | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic stock market)లో ఐపీవో(IPO)ల జాతర కొనసాగుతోంది. ఈ వారంలో తొమ్మిది కంపెనీలు లిస్టవనుండగా.. మరో ఏడు కంపెనీల సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. గత వారంలో 19 కంపెనీలు లిస్టయిన విషయం తెలిసిందే..
IPO | మెయిన్ బోర్డ్‌నుంచి రెండు..
ఈ వారంలో ప్రారంభమయ్యే ఐపీవోలలో రెండు మెయిన్ బోర్డు(Main board) కంపెనీలు ఉన్నాయి. మిగిలిన ఐదు ఎస్‌ఎంఈ(SME)లే.. మార్కెట్‌నుంచి రూ. 2 వేల కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో మెయిన్‌బోర్డుకు చెందిన ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్(Travel Food Services) కంపెనీ ఐపీవోకు వస్తోంది. ఈనెల 7 నుంచి 9 వరకు సబ్‌స్క్రిప్షన్ గడువు ఇచ్చారు. ఒక్కో ఈక్విటీ షేరు గరిష్ట ధర రూ. 1,100. లాట్‌లో 13 షేర్లున్నాయి. ఒక లాట్ కోసం రూ. 14,300తో బిడ్ వేయాల్సి ఉంటుంది. స్మార్ట్ వర్క్స్ కోవర్కింగ్(Smartworks Coworking) కంపెనీ సబ్‌స్క్రిప్షన్ ఈనెల 10వ తేదీన ప్రారంభం కానుంది. ఈ కంపెనీకి సంబంధించిన ప్రైస్‌బాండ్, ఇతర వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
IPO | ఎస్‌ఎంఈ ఐపీవోల వివరాలు…
స్మార్టెన్ పవర్ సిస్టమ్స్..
స్మార్టెన్ పవర్ సిస్టమ్స్(Smarten Power Systems) మార్కెట్‌నుంచి రూ. 47.5 కోట్లు సమీకరించనుంది. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్ గడువుంది. 14న కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో లిస్టవుతాయి. ఒక్కో షేరు ధర రూ. 100. ఒక లాట్‌లో 1,200 షేర్లున్నాయి. ఆసక్తిగలవారు రూ. 1.20 లక్షలతో బిడ్ దాఖలు చేయాలి.
IPO | కెమ్‌కార్ట్ ఇండియా
రూ. 75.96 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో కెమ్‌కార్ట్ ఇండియా(Chemkart India) ఐపీవోకు వస్తోంది. ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌కు 7 నుంచి9 వ తేదీ వరకు గడువుంది. ఒక లాట్‌లో 600 షేర్లుంటాయి. ఐపీవో ప్రైస్ రూ. 248. రూ. 1,48,800 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ షేర్లు 14న బీఎస్‌ఈలో లిస్టవుతాయి.
IPO | గ్లెన్ ఇండస్ట్రీస్
గ్లెన్ ఇండస్ట్రీస్(GLEN Industries) రూ. 59.86 కోట్లు సమీకరించనుంది. సబ్‌స్క్రిప్షన్ ఈనెల 8న ప్రారంభమై 10న ముగుస్తుంది. ఈ కంపెనీ షేర్లు 15వ తేదీన బీఎస్‌ఈలో లిస్టవుతాయి. లాట్‌లో 1,200 షేర్లున్నాయి. ఒక్కో షేరు ధర రూ. 92. ఒక లాట్ కోసం రూ. 1,16,400 తో దరఖాస్తు చేసుకోవాలి.
IPO | సీఎఫ్‌ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్
సీఎఫ్‌ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్(CFF Fluid Control) కంపెనీ రూ. 83.19 కోట్లను సమీకరించడం కోసం ఐపీవోకు వస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ఈనెల 9న ప్రారంభమై 11న ముగుస్తుంది. ఒక్కో షేరు ధర రూ. 585. లాట్‌లో 200 షేర్లున్నాయి. ఒక లాట్ కోసం రూ. 1,17,000 తో దరఖాస్తు చేసుకోవాలి. ఈ కంపెనీ షేర్లు 16వ తేదీన బీఎస్‌ఈలో లిస్ట్ కానున్నాయి.
IPO | ఆస్టన్ ఫార్మాసూటికల్స్
ఆస్టన్ ఫార్మాసూటికల్స్(Asston Pharmaceuticals) రూ. 26.17 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఈనెల 9 నుంచి 11 వ తేదీ వరకు బిడ్లు వేయొచ్చు. కంపెనీ షేర్లు 16న బీఎస్‌ఈలో లిస్టవుతాయి. లాట్‌లో 2వేల షేర్లున్నాయి. ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 123 గా నిర్ణయించారు. ఒక లాట్ కోసం రూ. 2,46,000 లతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
IPO | లిస్టయ్యే కంపెనీలివే..
మెయిన్ బోర్డు ఐపీవో క్రిజాక్(Crizac) ఈనెల 9వ తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ కానుంది.
ఎస్‌ఎంఈ కంపెనీలైన పుష్పా జ్కువెల్లర్స్, సిల్కీ ఓవర్‌సీస్, సీడార్ టెక్స్‌టైల్ కంపెనీలు సోమవారం ఎన్‌ఎస్‌ఈలో మార్క్ లాయిరీ, వందన్ ఫుడ్స్ బీఎస్‌ఈలో లిస్టవుతాయి.
ఈనెల 10వ తేదీన వైట్ ఫోర్స్ ఎన్‌ఎస్‌ఈలో, క్రయోజెనిక్ ఓజీఎస్, మెటా ఇన్ఫోటెక్ బీఎస్‌ఈలో లిస్ట్ కానున్నాయి.
Read all the Latest News on Aksharatoday.in