అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Terror Attack |కశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్(IPL)లో బుధవారం జరిగే మ్యాచ్‌లో నివాళులు అర్పించనున్నారు. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), ముంబయి ఇండియన్స్(Mumbai Indians) మధ్య మ్యాచ్ జరగనుంది. ఉగ్రదాడి నేపథ్యంలో స్టేడియంలో ప్లేయర్లు మౌనం పాటించనున్నారు.
మృతులకు సంతాపంగా ఈ రోజు మ్యాచ్‌లో టపాసులు పేల్చకూడదని, చీర్ లీడర్ల ప్రదర్శన ఉంచొద్దని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ప్రతి మ్యాచ్‌లో ఫోర్లు, సిక్స్‌లు కొట్టినప్పుడు.. వికెట్లు పడినప్పుడు టపాసులు పేల్చడంతో పాటు, చీర్ లీడర్లు డ్యాన్స్ చేస్తారు. అయితే ఉగ్రదాడిలో మృతులకు సంతాపంగా ఈ రోజు వాటిని తీసివేస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు(IPL Organizers) ప్రకటించారు.