అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2025 | ఐపీఎల్ IPl 2025 సీజన్ ipl season 2025 రసవత్తర దశకు చేరుకుంది. ప్రతీ జట్టు ఇప్పటికే 8 నుంచి 9 మ్యాచ్‌లు ఆడాయి. ఇంకా ఒక్కో జట్టు 6 నుంచి 5 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. ఈ ఐదు ఆరు మ్యాచ్‌లే.. జట్ల ప్లే ఆఫ్స్ play off teams ipl భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ఈ క్రమంలోనే ఇక నుంచి జరిగే ప్రతీ మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది. ప్రతీ ఫలితం ప్లే ఆఫ్స్ చేరే జట్లపై ప్రభావం చూపనుంది. రన్ రేట్ run rate కూడా కీలకం కానుంది.
గురువారం జరిగిన ఆర్‌సీబీ- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అనంతరం పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్ టైటాన్స్ GT అగ్రస్థానంలో నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్DC, ఆర్‌సీబీ RCB, ముంబై ఇండియన్స్ MI వరుసగా టాప్-4లో కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్, ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతుండగా.. రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగు స్థానాల్లో నిలిచాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ చేరే జట్ల అవకాశాలను పరిశీలిస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్, సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ దాదాపుగా ఈ రేసు నుంచి తప్పుకున్నాయి. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టాప్-3 ప్లేస్‌లు ఖరారు కానుండగా.. నాలుగో స్థానం కోసం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
IPL 2025 | ప్లే ఆఫ్స్ చేరే జట్ల అవకాశాలు..
1. గుజరాత్ టైటాన్స్-90 శాతం
2. ఢిల్లీ క్యాపిటల్స్-84 శాతం
3. ఆర్‌సీబీ-75 శాతం
4. పంజాబ్ కింగ్స్-56 శాతం
5. ముంబై ఇండియన్స్-48 శాతం
6. లక్నో సూపర్ జెయింట్స్-31 శాతం
7.కోల్‌కతా నైట్‌రైడర్స్- 13 శాతం
8. సన్‌రైజర్స్ హైదరాబాద్-1 శాతం
9. చెన్నై సూపర్ కింగ్స్-0.7 శాతం
10. రాజస్థాన్ రాయల్స్-0.2 శాతం