More
    Homeక్రీడలుIPL 2025 | పంజాబ్‌ కింగ్స్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

    IPL 2025 | పంజాబ్‌ కింగ్స్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2025 |పంజాబ్ కింగ్స్‌(Punjab Kings) జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా విధ్వంసకర ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్‌(Glenn Maxwell) ఈ సీజన్‌‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గ్లేన్ మ్యాక్స్ వెల్ చేతి వేలు విరిగిందని, తదుపరి మ్యాచ్‌లు ఆడలేడని పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌ రికీ పాంటింగ్(Ricky Ponting) తెలిపాడు. ఈ గాయం కారణంగానే మ్యాక్స్‌వెల్ చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)తో బుధవారం జరిగిన మ్యాచ్ ఆడలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌(Kolkata Knight Riders)తో జరిగిన మ్యాచ్‌లో గ్లేన్ మ్యాక్స్‌వెల్ గాయపడినట్లు తెలుస్తోంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. అతని చేతి వేలు విరిగిందని ఆ జట్టు స్టార్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్ తెలిపాడు.

    ‘దురదృష్టవశాత్తూ.. గ్లేన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) చేతి వేలు విరిగింది. ట్రైనింగ్ సెషన్‌లో అతను గాయపడ్డాడు. ముందు అది చిన్న గాయమేనని భావించాం. కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్కానింగ్ తీయగా.. వేలు విరిగినట్లు తేలింది. దాంతో అతను ఈ టోర్నీ(Tournament) మొత్తానికి దూరంగా ఉండనున్నాడు’ అని మార్కస్ స్టోయినీస్(Marcus Stoinis) చెప్పుకొచ్చాడు. మ్యాక్స్‌వెల్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కావాల్సిన సరైన ఆటగాడి కోసం వెతుకుతున్నామని రికీ పాంటింగ్ తెలిపాడు.

    ఈ సీజన్‌లో గ్లేన్ మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడి 97.95 స్ట్రైక్ రేటుతో 0, 30, 1, 3, 7, 7 కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. వరుసగా విఫలమైనా.. రికీ పాంటింగ్‌(Ricky Ponting) మ్యాక్స్‌వెల్‌కు అండగా నిలిచాడు. ప్రతీ మ్యాచ్‌లో విఫలమైనా తుది జట్టులో అవకాశం కల్పించాడు. ఇప్పుడు గాయంతో దూరమవడంతో పంజాబ్ ఫ్యాన్స్(Punjab Fans) సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌ బెర్త్ దక్కించుకునేందుకు మరో రెండు విజయాల దూరంలో నిలిచింది. సీఎస్‌కే(CSK)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

    Latest articles

    Upasana | కొత్త ఆవ‌కాయ ప‌చ్చ‌డిని దేవుడి ద‌గ్గ‌ర పెట్టి అత్త‌మ్మ‌తో క‌లిసి పూజ‌లు చేసిన ఉపాస‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ Surekha పుట్టినరోజు సందర్భంగా ఉపాసన కొణిదెల.. తన కొత్త బిజినెస్...

    ACB | ఏసీబీ దూకుడు.. ఏప్రిల్​లో ఎంతమంది చిక్కారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB | అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు దూకుడు పెంచారు. దీంతో ఏప్రిల్​ రికార్డు...

    IPL 2025 | ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్‌కే ఔట్.. ఆ ఐదుగురు ఆటగాళ్లపై వేటు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) పోరాటం ముగిసింది. ప్లే...

    Mla Madan Mohan Rao | ఎల్లారెడ్డి బస్టాండ్​ను త్వరలోనే ప్రారంభిస్తాం

    అక్షరటుడే,ఎల్లారెడ్డి: Mla Madan Mohan Rao | పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్​లో (RTC Bus stand) పనులన్నీ పూర్తిచేసి...

    More like this

    Upasana | కొత్త ఆవ‌కాయ ప‌చ్చ‌డిని దేవుడి ద‌గ్గ‌ర పెట్టి అత్త‌మ్మ‌తో క‌లిసి పూజ‌లు చేసిన ఉపాస‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ Surekha పుట్టినరోజు సందర్భంగా ఉపాసన కొణిదెల.. తన కొత్త బిజినెస్...

    ACB | ఏసీబీ దూకుడు.. ఏప్రిల్​లో ఎంతమంది చిక్కారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB | అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు దూకుడు పెంచారు. దీంతో ఏప్రిల్​ రికార్డు...

    IPL 2025 | ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్‌కే ఔట్.. ఆ ఐదుగురు ఆటగాళ్లపై వేటు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) పోరాటం ముగిసింది. ప్లే...
    Verified by MonsterInsights