అక్షరటుడే, వెబ్‌డెస్క్: iPhone 15 | ఐఫోన్ 15 అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేసే అవకాశం రానుంది. అమెజాన్ తన యూజర్ల కోసం జూలై 12 నుంచి ప్రైమ్ డే సేల్ (Prime Day sale) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అతి తక్కువ ధరకే ప్రముఖ సంస్థ యాపిల్‌కు చెందిన ఐఫోన్ 15ను సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు లేదా ఈఎంఐ ఎంపికలను (bank cards or EMI options) ఉపయోగించి అదనపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. సెప్టెంబర్ 2023లో మార్కెట్లోకి లాంచ్ అయిని ఐఫోన్ 15 శక్తివంతమైన 48-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, అధునాతన చిప్సెట్ కలిగి ఉంది.
iPhone 15 | భారీ డిస్కౌంట్
అమెజాన్ తన యూజర్ల కోసం నిర్వహిస్తున్న ప్రైమ్ డే సేల్(Prime Day sale)లో ఐఫోన్ 15 అతి తక్కువ ధరలో లభ్యం కానుంది. ప్రస్తుతం ఈ మోడల్ ధర ఆపిల్ ఇండియా వెబ్సైట్ ప్రకారం రూ.69,900 ఉంది. నలుపు, నీలం, ఆకుపచ్చ, గులాబీ రంగుల్లో ఉండే ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర అమెజాన్‌లో రూ. 60,200గా చూపిస్తోంది. అయితే, ప్రైమ్ డే సేల్ సమయంలో కొనుగోలుదారులు 128GB వేరియంట్‌ను కేవలం రూ. 57,249కి (బ్యాంక్ ఆఫర్ తో కలిపి) పొందవచ్చు. పాత పరికరాలను మార్పిడి చేసుకోవాలనుకునే వారికైతే రూ. 52 వేలకే వస్తుంది. ఇక, ఈఎంఐలో తీసుకున్నా, బ్యాంక్ క్రెడిట్ కార్డులను (Amazon Pay ICICI Bank credit card) ఉపయోగించి కొనుగోలు చేసినా అదనంగా 5 శాతం తగ్గింపు ప్రయోజనం పొందవచ్చు.
iPhone 15 | స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 15 గ్లాస్ బ్యాక్, అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌ను కలిగి ఉన్న ఈ వేరియంట్. నీళ్లలో పడినా ఫోన్ కు ఏమీ కాదు.. స్మార్ట్ ఫోన్ డాల్బీ విజన్ సపోర్టుతో 6.1-అంగుళాల సూపర్ రెటినా OLED డిస్ప్లే కలిగి ఉంది, అదనపు రక్షణ కోసం డిస్ప్లే సిరామిక్ షీల్డ్ గ్లాస్ ఏర్పాటు చేశారు. ఈ మోడల్ ఆపిల్ A16 బయోనిక్ చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే, ఇది 48, 12 మెగాపిక్సెల్ తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో ఉన్న 3349mAh బ్యాటరీ ఇది 15W ఫాస్ట్ చార్జింగ్కు సపోర్టు చేస్తుంది.