అక్షరటుడే, కామారెడ్డి: Telangana Police | అమెరికాలో తెలంగాణ కానిస్టేబుల్ అంతర్జాతీయ మెడల్ (International Medal) సాధించాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన కానిస్టేబుల్ మహమ్మద్ బాబా (Constable Mohammed Baba) ప్రస్తుతం ఐజీపీ స్పోర్ట్స్ హైదరాబాద్‌లో (IGP Sports Hyderabad) అటాచ్డ్గా విధులు నిర్వహిస్తున్నాడు. గతనెల 27 నుంచి ఈనెల 6 వరకు అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో (Birmingham) జరుగుతున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్-2025లో (World Police and Fire Game) పాల్గొన్నారు.
షాట్‌పుట్-ట్రాక్ అండ్ ఫీల్డ్ (hot Put-Track and Field) (35 ప్లస్) విభాగంలో తెలంగాణ నుండి భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆయన బ్రాంజ్ మెడల్ సాధించి దేశానికి, రాష్ట్రానికి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. ఇది కామారెడ్డి జిల్లా పోలీస్‌కు గర్వకారణమన్నారు. ప్రతిభావంతులకు మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అభినందనలు తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున కానిస్టేబుల్ మహమ్మద్ బాబాకు శుభాకాంక్షలు తెలిపారు.