అక్షరటుడే, అమరావతి: Pawan Kalyan : ఆ విద్యార్థి చదువుతుంది ఇంటర్.. ఆలోచనలు ఇంజినీరింగ్ స్థాయి.. తన సమస్యకు పరిష్కారం చూసుకున్నాడు. దూరాన ఉన్న కాలేజీకి వెళ్లేందుకు సొంతంగా బ్యాటరీ సైకిల్‌ను రూపొందించాడు. ఈ విద్యార్థి రూపొందించిన సైకిల్‌ను చూసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (Andhra Pradesh Deputy Chief Minister) ముచ్చట పడ్డారు. ఆ సైకిల్ కూర్చుని సదరు బాలుడిని కూర్చోబెట్టుకుని చక్కర్లు కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Pawan Kalyan : ఒక్కసారి ఛార్జింగ్ పెడితే..
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని విజయనగరం జిల్లా(Vizianagaram district)కు చెందిన ఇంటర్(intermediate) విద్యార్థి రాజాపు సిద్ధూ బ్యాటరీ సైకిల్‌ను రూపొందించాడు. జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ పదో తరగతి తర్వాత దూరాన ఉన్న ఇంటర్మీడియెట్ కాలేజీకి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డాడు. తన సమస్యకు తానే పరిష్కారం వెతుక్కున్నాడు. తన సైకిల్‌ను బ్యాటరీ సైకిల్‌గా మార్చేశాడు. సిద్ధూ రూపొందించిన బ్యాటరీ సైకిల్ మూడు గంటలపాటు ఛార్జింగ్ చేస్తే.. 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
Pawan Kalyan : రూ. లక్ష ప్రోత్సాహకం..
సృజనాత్మక ఆలోచన(creative idea)తో బ్యాటరీ సైకిల్(battery cycle) ఆవిష్కరించిన సిద్ధూ బ్యాటరీ సైకిల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సామాజిక మాధ్యమాల(social media) ద్వారా సిద్ధూ గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలుసుకున్నారు. దీంతో వెంటనే ఆ బాలుడిని మంగళరిగి(Mangalari)లోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నారు. స్వయంగా సైకిల్‌ను చూసి నడిపారు. విద్యార్థి ఆవిష్కరణను స్వయంగా తిలకించి, ముచ్చట పడ్డారు. ఈ సందర్భంగా బాలుడు సిద్ధూని అభినందించారు. ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని సిద్ధూకు సూచించారు. ప్రోత్సాహకంగా బాలుడికి రూ. లక్ష అందించారు. అనంతరం బాలుడితో కలిసి బ్యాటరీ సైకిల్ పై చక్కర్లు కొట్టారు.