అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Inter Results | రాష్ట్రంలో ఒక తరం దారి తప్పుతోంది. అవును మీరు విన్నది నిజమే. స్మార్ట్ ఫోన్ smart phone, సోషల్ మీడియా social media, సెన్సిటివ్ పెరెంటింగ్ sensitive parenting కారణంగా విద్యార్థులు చదువుల్లో తప్పుతున్నారు. ఆ తర్వాత జీవితాల్లో చాలా కోల్పోతున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలే inter results ఇందుకు నిదర్శనం. పదో తరగతిలో tenth class ఏదోలా పాస్ అవుతున్న విద్యార్థులు ఇంటర్‌కు వచ్చే సరికి దారి తప్పుతున్నారు.
పదో తరగతిలో మంచి మార్కులతో పాసైన వారు ఇంటర్ వచ్చే సరికి ఫెయిల్ అవుతున్నారు. 2023 పదో తరగతి విద్యార్థులు 86.6శాతం పాసయ్యారు. ప్రస్తుతం ఆ విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పూర్తి చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది సెకండియర్ ఉత్తీర్ణత శాతం 71.37 కావడం గమనార్హం. అదే 2024లో పదో తరగతిలో 91.31శాతం మంది పాస్ అయ్యారు. వారు ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాశారు. ఇందులో 66.89శాతం మందే ఉత్తీర్ణత సాధించారు.
Inter Results | గత మూడేళ్లలో ఇంటర్లో ఉత్తీర్ణత శాతం
2023: ఫస్టియర్‌లో గర్ల్స్ 68.68 శాతం, బాయ్స్ 54.66 శాతం.
సెకండియర్‌లో గర్ల్స్ 71.57 శాతం, బాయ్స్ 55.60 శాతం
2024: ఫస్టియర్‌లో గర్ల్స్ 68.35 శాతం, బాయ్స్ 51.50 శాతం
సెకండియర్‌లో గర్ల్స్ 72.53 శాతం, బాయ్స్ 56.10 శాతం
2025: ఫస్టియర్‌లో గర్ల్స్ 73.83 శాతం, బాయ్స్ 57.83 శాతం
సెకండియర్‌లో గర్ల్స్ 74.21శాతం, బాయ్స్ 57.31 శాతం
Inter Results | ఎందుకిలా..
ఇంటర్ interకు వచ్చే సరికి చాలా మంది విద్యార్థులు చదువుపై శ్రద్ధ కనబర్చడం లేదు. అధ్యాపకులు, కాలేజీ, పరీక్షలను లెక్క చేయని వారు సైతం ఉన్నారు. ముఖ్యంగా బాలురు boys కాలేజీలకు సక్రమంగా వెళ్లడం లేదు. పట్టణాల్లోని కార్పొరేట్ కాలేజీల్లో మినహా మిగతా చోట్ల చాలా మంది కాలేజీలకు మొక్కుబడిగా వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని rural areas కాలేజీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కళాశాలలకు విద్యార్థులు సక్రమంగా వెళ్లడం లేదు. గతంలో కామారెడ్డి kamareddy జిల్లాలోని ఓ కళాశాల అధ్యాపకులు దయచేసి కాలేజీకి రండి అంటూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మరి కోరారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Inter Results | స్మార్ట్మాయ
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్‌ఫోన్ smart phone ఉంది. ఇంటర్‌కు రాగానే విద్యార్థులకు తల్లిదండ్రులు ఫోన్లు కొనిస్తున్నారు. ఈ స్మార్ట్ మాయలో పడిన విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పి సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. అంతేగాకుండా తల్లిదండ్రులు కూడా అతి గారబంగా పెంచుతున్నారు. దీంతో తల్లిదండ్రుల మాటను పిల్లలు లెక్క చేయడం లేదు. తల్లిదండ్రులే పిల్లలు చెప్పినట్లు వింటున్నారు. పెద్ద ఫోన్లు, పెద్ద పెద్ద బైక్‌లు కొనివ్వమని కోరుతూ.. వాటిపై జల్సాలు చేస్తున్న కొందరు విద్యార్థులు కాలేజీలకు వెళ్లడం లేదు. దీంతో ఉత్తీర్ణత శాతం తగ్గిపోతుంది. ఇది రానున్న రోజుల్లో రాష్ట్ర ఆర్థిక, సామాజిక రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.