అక్షరటుడే నిజామాబాద్ సిటీ: State Health Director | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిని స్టేట్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ తనిఖీ చేశారు. తెలంగాణలోనే పెద్ద కళాశాలల్లో నిజామాబాద్ మెడికల్ కళాశాలల్లో (Nizamabad Medical College) ఒక్కటని పేర్కొన్నారు. త్వరలో ఎంసీఐ తనిఖీలు ఉన్నందున ఎలాంటి లోపాలు ఉండకూడని ఆయన అధికారులను ఆదేశించారు.
State Health Director | వార్డుల పరిశీలన
జీజీహెచ్లో (GGH Nizamabad) వార్డులను, కళాశాలలో తరగతి గదులను డైరెక్టర్ పరిశీలించారు. వార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ, పెద్దోళ్ల నాగరాజు తదితరులు ఉన్నారు.