అక్షరటుడే, వెబ్‌డెస్క్: IndiGo flight : గన్నవరం ఎయిపోర్టు(Gannavaram airport)లో ఇండిగో విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. సదరు విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ గుర్తించి ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసినట్లు చెబుతున్నారు. బెంగుళూరు (Bangalore) నుంచి హైదరాబాద్(Hyderabad) వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మరో మాటగా.. హైదరాబాద్‌లో ల్యాండ్ చేసేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో ఏటీసీ అధికారులు గన్నవరం విమానాశ్రయానికి విమానాన్ని దారి మళ్లించినట్లు పేర్కొంటున్నారు. ఈ ఇండిగో విమానంలో ఆ సమయంలో 222 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం అత్యవసర ల్యాండింగ్‌తో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు.
IndiGo flight : వరుస ఘటనలతో..
అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ఘోర ప్రమాద ఘటన తర్వాత విమాన ప్రయాణికులు భయపడిపోతున్నారు. విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో విమాన ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి ఉంటోంది. దీంతో పలువురు విమాన ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు.