More
    Homeబిజినెస్​Stock Market | లాభాల్లో ముగిసిన సూచీలు..

    Stock Market | లాభాల్లో ముగిసిన సూచీలు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) శుక్రవారం తీవ్ర ఒడిదుడుకుల(Volitility) మధ్య కొనసాగి చివరికి లాభాలతో ముగిశాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex) ఇంట్రాడేలో గరిష్టంగా 935 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ స్వల్ప నష్టాలతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 255 పాయింట్లు లాభపడింది. రెసిప్రోకల్‌ టారిఫ్స్‌ విషయంలో యూఎస్‌(US)తో చర్చలకు సానుకూలంగా ఉన్నామని చైనా ప్రకటించడం, త్వరలోనే భారత్‌, జపాన్‌(Japan), సౌత్‌ కొరియాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయని అమెరికా పేర్కొనడం, నాలుగో త్రైమాసిక ఫలితాలు బాగుండడం, రూపాయి విలువ బలపడుతుండడం, బ్యాంకింగ్‌ సెక్టార్‌(Banking sector) బలంగా ఉండడంతో తొలి గంటలో ప్రధాన సూచీలు పైపైకి దూసుకువెళ్లాయి. అయితే భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు, యూఎస్‌లో ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలతో ఇన్వెస్టర్లు(Invetors) ఒక్కసారిగా లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరికి సెన్సెక్స్‌ 259 పాయింట్ల లాభంతో 80,501 వద్ద, నిఫ్టీ(Nifty) 12 పాయింట్ల లాభంతో 24,346 వద్ద స్థిరపడ్డాయి.

    Stock Market | మిశ్రమ స్పందన..

    మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.4 శాతం నష్టపోగా లార్జ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్‌ఈ పవర్‌(Power) 0.93 శాతం, మెటల్‌ 0.6 శాతం, హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ 0.5 శాతం నష్టపోగా.. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్‌ 0.7 శాతం, ఐటీ(IT) సూచీ అరశాతం వరకు లాభపడ్డాయి.
    బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,761 కంపెనీలు లాభపడగా, 2,183 కంపెనీలు నష్టపోయాయి. 141 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 67 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ట్రేడ్‌ అవగా.. 58 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కొనసాగాయి.
    9 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌(Upper circuit)ను, 7 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

    Stock Market | Top Gainers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌(BSE Sensex) 30 ఇండెక్స్‌లో 19 స్టాక్స్‌ పాజిటివ్‌గా.. 11 స్టాక్స్‌ నెగెటివ్‌గా ముగిశాయి. అదాని పోర్ట్స్‌(Adani ports) 4.11 శాతం పెరగ్గా.. బజాజ్‌ ఫైనాన్స్‌ 2.62 శాతం లాభపడింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, మారుతి, టాటా మోటార్స్‌, ఐటీసీ(ITC), టాటా స్టీల్‌ ఒక శాతానికిపైగా పెరిగాయి. రిలయన్స్‌, ఎటర్నల్‌, ఇన్ఫోసిస్‌లోనూ కొనుగోళ్ల మద్దతు లభించింది.

    Stock Market | Top Losers..

    నెస్లే 2.28 శాతం పడిపోయింది. ఎస్టీపీసీ(NTPC), కొటక్‌ బ్యాంక్‌, టైటాన్‌ ఒక శాతానికిపైగా నష్టపోయాయి. పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, ఎయిర్‌టెల్‌, హెయూఎల్‌(HUL), ఆసియా పెయింట్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ – 03 మే 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం –...

    Indiramma houses | ఇందిరమ్మ ఇళ్లు 60 గజాలకు మించొద్దు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...

    EPFO | మీ పీఎఫ్​ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో.. జస్ట్​ మిస్డ్​ కాల్​తో తెలుసుకోండి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : EPFO | ప్రతి ప్రైవేట్​ ఉద్యోగికి ఆయా సంస్థలు పీఎఫ్ PF​ సౌకర్యం...

    Bangladesh | కయ్యానికి కాలు దువ్వుతున్న బంగ్లాదేశ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bangladesh | పాక్ pak​పై దాడి చేస్తే భారత్​లోని ఈశాన్య రాష్ట్రాలను Northeastern states...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ – 03 మే 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం –...

    Indiramma houses | ఇందిరమ్మ ఇళ్లు 60 గజాలకు మించొద్దు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...

    EPFO | మీ పీఎఫ్​ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో.. జస్ట్​ మిస్డ్​ కాల్​తో తెలుసుకోండి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : EPFO | ప్రతి ప్రైవేట్​ ఉద్యోగికి ఆయా సంస్థలు పీఎఫ్ PF​ సౌకర్యం...
    Verified by MonsterInsights