అక్షరటుడే, వెబ్డెస్క్ : Stock Market | అంతర్జాతీయ మార్కెట్లు(International Markets) మిశ్రమంగా కొనసాగుతున్నాయి. మన మార్కెట్లు మాత్రం స్వల్ప నష్టాలతో కదలాడుతున్నాయి. గురువారం ఉదయం 58 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex).. ఇంట్రాడే లో గరిష్టంగా 287 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ(Nifty) 51 పాయింట్ల నష్టంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 89 పాయింట్లు పడిపోయింది.
ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ (Sensex) 187 పాయింట్ల నష్టంతో 79,920 వద్ద, నిఫ్టీ(Nifty) 44 పాయింట్లు లాభంతో 24,284 వద్ద కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో మన మార్కెట్లు ఊహించిన దానికన్నా ఎక్కువగా పెరగడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ (Profit booking )కు దిగారు. పహల్గాం ఘటన నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తత ప్రభావం స్టాక్ మార్కెట్లపై కనిపించింది.
Stock Market | Top Gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ -30 ఇండెక్స్(Index)లో 17 స్టాక్స్ లాభాలతో 13 స్టాక్స్ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ ( Indusind bank) 4.8 శాతానికిపైగా లాభంతో ఉండగా.. నెస్లే, ఆసియా పెయింట్ ఒక శాతానికి పైగా లాభంతో కొనసాగుతున్నాయి. మారుతి, టాటా మోటార్స్(Tata motors), ఆక్సిస్ బ్యాంకు, అల్ట్రా టెక్, ఐటీసీ, అదాని పోర్ట్స్ లాభాలతో కదలాడుతున్నాయి.
Stock Market | Top Losers..
హెచ్యూఎల్ 2.8 శాతానికిపైగా నష్టంతో ఉండగా.. ఎయిర్టెల్(Airtel), ఎం అండ్ ఎం ఒక శాతానికిపైగా నష్టంతో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు (Icici bank), హెచ్సీఎల్ టెక్, టీసీఎస్,హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్(Reliance) అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.