అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock market | అంతర్జాతీయ మార్కెట్ల(International Markets)లో అనిశ్చితి ఉన్నా.. మంగళవారం మన మార్కెట్లు markets మాత్రం పాజిటివ్‌గానే ప్రారంభమయ్యాయి. మొదట్లో అమ్మకాల ఒత్తిడి కనిపించినా.. వెంటనే కోలుకుని లాభాల profits బాటపట్టాయి. ఉదయం 320 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex).. తొలి పావుగంటలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్(Profit booking)కు దిగడంతో నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో గరిష్టంగా 475 పాయింట్లు పడిపోయింది. ఆ తర్వాత కోలుకుని తిరిగి పైకి ఎగబాకింది.
నిఫ్టీ(Nifty) 60 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా తొలుత ఒడిదుడుకులను ఎదుర్కొని ఇంట్రాడేలో గరిష్టంగా 113 పాయిట్లు పడిపోయింది. ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో లాభాల బాట పట్టింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ (Sensex) 405 పాయింట్ల లాభంతో 79,816 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు లాభంతో 24,237 వద్ద కొనసాగుతున్నాయి.
Stock market | రాణిస్తున్న అన్ని రంగాలు..
బీఎస్‌ఈ(BSE)లో అన్ని ప్రధాన రంగాల షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్(PSU Bank) స్టాక్స్ విశేషంగా రాణిస్తున్నాయి. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ దూసుకుపోతున్నాయి.
Stock market | Top Gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ -30 ఇండెక్స్(Index)లో 17 స్టాక్స్ లాభాలతో 13 స్టాక్స్ stocks నష్టాలతో కొనసాగుతున్నాయి. కొటక్ బ్యాంక్ kotak bank రెండు శాతానికిపైగా లాభపడగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎటర్నల్, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్(Bajaj finance) ఒక శాతానికిపైగా లాభంతో కదలాడుతున్నాయి.
Stock market | Top Losers..
ఇండస్ ఇండ్ బ్యాంక్ IndusInd Bank 3.7 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఇన్ఫోసిస్ infosys, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఒక శాతానికిపైగా నష్టంతో ఉన్నాయి.