అక్షరటుడే, వెబ్‌డెస్క్:Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) ప్రారంభం నష్టాలనుంచి కోలుకున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌లో దూకుడు కొనసాగగా.. ఐటీ స్టాక్స్(IT stocks)లో కొనుగోళ్ల మద్దతు లభించింది.
బుధవారం ఉదయం నిఫ్టీ ఫ్లాట్‌గా, సెన్సెక్స్ 36 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు నష్టాల్లో కొనసాగిన ప్రధాన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్(Sensex) రోజంతా 82,342 నుంచి 82,784 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,121 నుంచి 25,255 పాయింట్ల మధ్యలో కదలాడాయి. ఇంట్రాడే కనిష్టాలనుంచి సెన్సెక్స్ 442 పాయింట్లు, నిఫ్టీ 134 పాయింట్లు పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 63 పాయింట్ల లాభంతో 82,634 వద్ద, నిఫ్టీ(Nifty) 16 పాయింట్ల లాభంతో 25,212 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 2,338 కంపెనీలు లాభపడగా 1,718 స్టాక్స్ నష్టపోయాయి. 162 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 145 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 37 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.రూపాయి విలువ స్వల్పంగా క్షీణించింది. విక్స్ మరింత తగ్గింది. రిలయన్స్(Reliance) క్యూ1 రిజల్ట్స్ బాగుంటాయన్న అంచనాలు ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. దీంతో మార్కెట్లు పాజిటివ్‌గా మారాయి.
Stock Market | స్వల్ప ఒడిదుడుకులు..
అన్ని రంగాలు మిశ్రమంగా స్పందించాయి. బీఎస్‌ఈ(BSE)లో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్(PSU Bank index) 1.77 శాతం పెరగ్గా.. ఐటీ ఇండెక్స్ 0.67 శాతం, రియాలిటీ 0.50 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.43 శాతం, పీఎస్‌యూ 0.43 శాతం, ఆటో ఇండెక్స్ 0.37 శాతం లాభపడ్డాయి. మెటల్(Metal) ఇండెక్స్ 0.61 శాతం, కమోడిటీ 0.37 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.24 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.15 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.28 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.10 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం లాభంతో ముగిశాయి.
Top Gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో 17 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం 2.25 శాతం, టెక్‌మహీంద్రా 1.94 శాతం, ఎస్‌బీఐ 1.63 శాతం, ఇన్ఫోసిస్ 1.57 శాతం, అదాని పోర్ట్స్ 0.73 శాతం లాభపడ్డాయి.
Top Losers:ఎటర్నల్ 1.69 శాతం, సన్‌ఫార్మా 1.49 శాతం, టాటా స్టీల్ 1.07 శాతం, టాటా మోటార్స్ 0.88 శాతం, బీఈఎల్ 0.75 శాతం నష్టాలతో ముగిశాయి.