అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Philippines | భారత పర్యాటకులను (Indian Tourists) ఆకర్షించడానికి ఫిలిప్పిన్స్(Philippines visa offer) దేశం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో పర్యటించే భారతీయులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. 14 రోజుల పాటు వీసా లేకుండానే (Visa Free) తమ దేశంలో పర్యటించవచ్చని ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. ద్వైపాక్షిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Philippines | పర్యాటకుల కోసం మాత్రమే..
తాజాగా తెచ్చిన నిబంధన కేవలం టూరిస్ట్ల కోసం మాత్రమే. పర్యాటకులు వీసా లేకుండా 14 రోజుల పాటు ఆ దేశంలోని ప్రాంతాలను సందర్శించవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులు, క్రూయిజ్ టెర్మినల్స్‌తో సహా అన్ని ప్రధాన ఎంట్రీ పాయింట్లలోకి వీసా లేకుండా వెళ్లవచ్చు.
Philippines | ఇవి నిబంధనలు
వీసా లేకుండా ఫిలిప్పీన్స్ వెళ్లిన వారు 14 రోజుల్లో భారత్కు తిరిగి రావాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో గడువు పొడిగించే అవకాశం లేదు. అలాగే వెళ్లాక ఇతర వీసాలోకి మార్చడం కూడా కుదరదు. ఫిలిప్పీన్స్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌లో సందర్శకులు ఎటువంటి అవమానకరమైన రికార్డులను కలిగి ఉండకూడదు.
ప్రయాణించే తేదికంటే ఆరు నెలల గడువు ఉన్న పాస్పోర్టు (passport) ఉన్నవారు వీసాలేకుండా ఆ దేశానికి వెళ్లొచ్చు. హోటల్ వసతి కోసం ముందుగానే బుక్ చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితులను తెలిపేలా బ్యాంక్ స్టేట్మెంట్ లేదా, ఉద్యోగ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. 14 రోజుల్లోగా రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని ఉండాలి. ఈ నిర్ణయంతో తమ దేశానికి భారత పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఫిలిప్పీన్స్ భావిస్తోంది. ఈ విధానం తక్షణమే అమలులోకి వస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది.