More
    Homeఅంతర్జాతీయంSwiss bank | స్విస్​ బ్యాంకుల్లో డబ్బును తెగ దాచేస్తున్న భారతీయులు.. గతేడాది కంటే మూడు...

    Swiss bank | స్విస్​ బ్యాంకుల్లో డబ్బును తెగ దాచేస్తున్న భారతీయులు.. గతేడాది కంటే మూడు రెట్లు పెరిగిన డిపాజిట్లు

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Swiss bank : కరోనా(Corona)తో సామాన్యులకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. ఐదేళ్లు అయినా నిలదొక్కుకోలేని దుస్థితి కొనసాగుతోంది. కానీ, పెంట మీద పెంట పడ్డట్టు.. ధనికులు మరింత ధనాన్ని ఆర్జిస్తూ, సంపాదనను ఏమి చేసుకోవాలో అర్థం కాక స్విస్​ బ్యాంకు తరలిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది.

    ప్రపంచంలో అక్రమార్జకులకు కొమ్ము కాస్తున్న స్విస్ బ్యాంకుల్లో భారతీయులు(Indians) దాస్తున్న డబ్బు భారీగా పెరిగిపోతోంది. డిపాజిట్లు 3.54 బిలియన్ స్విస్ ఫ్రాంక్​లకు చేరుకోవడం గమనార్హం. 2021 తర్వాత ఇది అత్యధికంగా గణాంకాలు చెబుతున్నాయి.

    స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయ డబ్బు రూ. 37,600 కోట్లకు చేరుకున్నాయి. అంటే ఇది గతేడాది కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు మూడు రెట్లు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్ లకు చేరుకున్నట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గురువారం (జూన్19) ప్రకటించింది.

    READ ALSO  Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ జంటకు "ఫిట్ ఇండియా కపుల్" అవార్డు

    భారతీయ క్లయింట్ల కస్టమర్ ఖాతాల్లోని డబ్బు ఈ ఏడాది కేవలం 11 శాతం మాత్రమే పెరిగి 346 మిలియన్ స్విస్ ఫ్రాంక్ లకు (దాదాపు రూ. 3,675 కోట్లు) చేరుకుంది.. ఇది మొత్తం నిధులలో పదో వంతు అని ప్రకటించింది స్విస్ బ్యాంకు.

    గ్లోబల్ ర్యాంకింగ్స్(global rankings) ప్రకారం.. 2024లో స్విస్ బ్యాంకుల్లో ఉన్న డబ్బులకు సంబంధించి భారత్​ 48వ స్థానంలో ఉంది. 2023లో 67వ స్థానంలో ఉండేది. ఈ డేటా ప్రకటన.. స్విస్ బ్యాంకులాంటి అంతర్జాతీయ ఆర్థిక(nternational financial) హోల్డింగ్ ల డైనమిక్ స్వభావ పారదర్శకతను నొక్కి చెబుతుంది.

    Latest articles

    Railway Passengers | ఆర్వోబీ వద్ద విరిగిన క్లస్టర్​.. నిలిచిపోయిన పలు రైళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | పెద్దపల్లి జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న రైల్వే...

    Jagannath Rath Yatra | నగరంలో కాసేపట్లో ప్రారంభం కానున్న జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, ఇందూరు:Jagannath Rath Yatra | ఇస్కాన్ ఆధ్వర్యంలో నిజామాబాద్​(Nizamabad) నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు జగన్నాథ...

    Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) వరుసగా నాలుగో రోజూ లాభాల...

    Kannappa Review | క‌న్న‌ప్ప మూవీ రివ్యూ… మంచు విష్ణు ఖాతాలో హిట్ ప‌డ్డ‌ట్టేనా..?

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Kannappa Review | మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కన్న‌ప్ప చిత్రం రూపొందింది. శివుడిపై తన భక్తిని,...

    More like this