More
    Homeఅంతర్జాతీయంIndian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త...

    Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Brands : భార‌తీయ విస్కీ బ్రాండ్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా విక్ర‌యిస్తున్న‌ విస్కీ బ్రాండ్ల‌లో మ‌న దేశానికి చెందిన ఎనిమిది బ్రాండ్లు టాప్‌-20 ప్లేస్‌లో నిలిచాయి. అందులో మెక్ డొవెల్స్ McDowells నంబ‌ర్‌వ‌న్ స్థానాన్ని ఆక్ర‌మించ‌గా, రాయ‌ల్ స్టాగ్‌ Royal Stag, ఆఫీస‌ర్స్ చాయిస్ Officer’s Choice వరుస‌గా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వాస్త‌వానికి విస్కీ ప్రియులను ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్ల గురించి అడిగితే.. జానీ వాకర్ Johnnie Walker, జాక్ డేనియల్స్ Jack Daniels, జేమ్సన్ Jameson వంటి పేర్లు చెబుతారు. కానీ రియాల్టీ ఏమిటంటే ప్రపంచ మార్కెట్‌లో భారతీయ విస్కీ ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 20 బ్రాండ్‌లలో ఎనిమిది మ‌న దేశానికే కావ‌డం విశేషం.

    READ ALSO  Iran-Israel Ceasefire | కాల్పుల విర‌మ‌ణకు ఓకే.. ఇంత‌కూ యుద్ధం గెలిచిందెవ‌రు..?

    Indian Brands : వృద్ధి చెందుతోన్న విస్కీ మార్కెట్‌..

    భారతదేశంలోని అపారమైన జనాభా, ప్రీమియం స్పిరిట్ల పట్ల పెరుగుతున్న ఆసక్తితో విస్కీ మార్కెట్ విప‌రీతంగా వృద్ధి చెందింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అమ్మ‌కాల్లో మెక్‌డోవెల్స్ నంబర్ 1, రాయల్ స్టాగ్, ఆఫీసర్స్ ఛాయిస్ వంటి బ్రాండ్లను అగ్రస్థానానికి చేర్చింది. ప్రపంచ వ్యాప్తంగా విస్కీ పరిశ్రమ విలువ సుమారు 1.8 ట్రిలియన్ డాల‌ర్లు కాగా, ఇది 2030 నాటికి సాలీనా 9.7% శాతం చొప్పున‌పెరుగుతుందని అంచనా. సరసమైన, ప్రీమియం విస్కీలకు పెరుగుతున్న డిమాండ్ కు ఇండియా, చైనా కీల‌కంగా మారాయి.

    Indian Brands : అత్య‌ధిక వినియోగం ఇండియాలోనే..

    విస్కీ విక్ర‌యాల్లో ఇండియానే నెంబ‌ర్ వ‌న్‌గా నిలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ వినియోగదారు ఇండియాగా పేరొందింది. ప్రపంచ విస్కీ వినియోగంలో దాదాపు సగం వాటా కలిగి ఉంది. ఈ అధిక డిమాండ్ భారతీయ విస్కీ బ్రాండ్ల భారీ అమ్మకాలకు దారి తీసింది. ఇండియాలో ఏటా బిలియ‌న్ల లీట‌ర్ల విస్కీని మ‌ద్యం ప్రియులు లాగించేస్తున్నారు. ఇండియాలో అత్య‌ధికంగా జ‌రుగుతున్న విస్కీ విక్ర‌యాల్లో మెక్‌డోవెల్స్ విస్కీ 31.4 మిలియ‌న్ లీట‌ర్లు, రాయల్ స్టాగ్ 27.9 మిలియ‌న్లు, ఆఫీసర్స్ ఛాయిస్ 23.4 మిలియ‌న్లు, ఇంపీరియల్ బ్లూ 22.8 మిలియ‌న్ లీట‌ర్ల విస్కీ అమ్ముడు పోతోంది. ప్ర‌పంచంలో జ‌రిగే టాప్-5 బ్రాండ్ల విక్ర‌యాల్లో నాలుగు ఇండియా నుంచే ఉండ‌డం విశేషం.

    READ ALSO  Indian Railways | త‌క్కువ ధ‌ర‌కే ల‌గ్జ‌రీ సేవ‌లు.. భోపాల్ స్టేష‌న్‌లో అందుబాటులోకి తెచ్చిన రైల్వే శాఖ

    Indian Brands : విదేశీ విస్కీ కూడా..

    ఇక‌, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 విస్కీ బ్రాండ్లలో విదేశీ బ్రాండ్లు కూడా ఉన్నాయి. స్కాట్లాండ్‌కు చెందిన‌ జానీ వాక‌ర్ 22.3 మిలియ‌న్ లీట‌ర్లు, అమెరికాకు చెందిన జిమ్ బీమ్ 17 మిలియ‌న్లు, జపాన్‌కు చెందిన సుంటోరీ కాకుబిన్ 15.8 మిలియ‌న్లు, అమెరికాకు చెందిన జాక్ డేనియల్స్ 14.3 మిలియ‌న్లు, ఇండియాకు చెందిన 8 పీఎం 12.2 మిలియ‌న్లు, ఐర్లాండ్‌కు చెందిన జేమ్సన్ 10.2 మిలియ‌న్ లీట‌ర్ల చొప్పున విక్ర‌యాలు జ‌రుగుతున్నాయి. వీటిలో స‌ర‌స‌మైన వాటితో పాటు ప్రీమియం బ్రాండ్లు కూడా ఉండ‌డం విశేషం.

    Latest articles

    Assembly Floor Leader | పదవి.. అధికారాన్ని కాపాడుకునేందుకే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ..

    అక్షరటుడే, ఇందూరు: Assembly Floor Leader | తన పదవి, అధికారాన్ని కాపాడటం కోసం ఆ రోజుల్లో ఇందిరాగాంధీ...

    Prashanth Kishor | సీఎం రేవంత్​రెడ్డిపై ప్రశాంత్​ కిశోర్​ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Prashanth Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్​ సురాజ్​ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​ తెలంగాణ ముఖ్యమంత్రి...

    Phone Tapping Case | కంచికి చేర‌ని క‌థ‌లెన్నో.. విచార‌ణల పేరిట ప్ర‌భుత్వాల కాల‌యాప‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Phone Tapping Case | తెలంగాణ‌లో కీల‌క అంశాలపై విచార‌ణ కొన‌సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వ‌రం,...

    CM Convoy | సీఎం కాన్వాయ్​ కార్లలో డీజిల్​కు బదులు నీళ్లు.. తర్వాత ఏం జరిగిందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Convoy | పెట్రోల్​ బంకుల్లో(Petrol Bunks) జరిగే మోసాలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం....

    More like this

    Assembly Floor Leader | పదవి.. అధికారాన్ని కాపాడుకునేందుకే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ..

    అక్షరటుడే, ఇందూరు: Assembly Floor Leader | తన పదవి, అధికారాన్ని కాపాడటం కోసం ఆ రోజుల్లో ఇందిరాగాంధీ...

    Prashanth Kishor | సీఎం రేవంత్​రెడ్డిపై ప్రశాంత్​ కిశోర్​ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Prashanth Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్​ సురాజ్​ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​ తెలంగాణ ముఖ్యమంత్రి...

    Phone Tapping Case | కంచికి చేర‌ని క‌థ‌లెన్నో.. విచార‌ణల పేరిట ప్ర‌భుత్వాల కాల‌యాప‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Phone Tapping Case | తెలంగాణ‌లో కీల‌క అంశాలపై విచార‌ణ కొన‌సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వ‌రం,...