అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Airlines | జమ్మూకశ్మీర్‌లోని (Jammu and Kashmir) పహల్గామ్ Pahalgam ఉగ్రదాడి అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారతదేశం పాక్‌కు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందం రద్దు, పాక్ పౌరుల వీసాల రద్దులతో పాటు, పాక్ ఎంబసీ అధికారుల (Pakistan Embassy Officials) కుదింపు తదితర చర్యలు తీసుకుంది. దీంతో పాకిస్తాన్ సైతం ప్రతిచర్యగా భారత విమానాలకు పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాయి.
Indian Airlines | పలు దేశాల ప్రయాణంపై ఎఫెక్ట్
పాక్ తన గగనతలాన్ని మూసివేయడంతో పలు దేశాలకు ప్రయాణ సమయం పెరుగనుంది. అమెరికాAmerica, లండన్London, యూరప్ Europe, పశ్చిమాసియా దేశాలకు West Asia ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఈ దిశగా భారత విమానయాన సంస్థలు ఫోకస్ చేశాయి. అయితే ఆల్టర్నేటివ్ రూట్స్‌లో ప్రయాణించడం వల్ల దూరం పెరుగుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు విమాన టికెట్ ధరలు flight charges hike పెరగనున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియాతో air india పాటు ఇండిగో indigo సంస్థలు ప్రయాణికులకు కలుగనున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నాయి.