అక్షరటుడే, వెబ్‌డెస్క్: MiG -21 | దశాబ్దాలు భారత సైన్యానికి సేవలు(Indian Army Services) అందిస్తున్న మిగ్ –21 ఇక కనుమరుగు కానున్నాయి. ఈ మేరకు భారత వైమానిక దళం(Indian Air Force) కీలక నిర్ణయం తీసుకుంది. మిగ్ –21 యుద్ధ విమనాలు పాత తరానికి చెందినవి. ప్రస్తుత పరిస్థితులకు అవి అనుకూలం కావు. దీంతో పాటు మిగ్ –21 విమానాలు తరుచూ కూలిపోయేవి. దీంతో వీటిని ఎగిరే శవపేటికలు అని ఎద్దేవా చేసేవారు. ఈ క్రమంలో వీటిని వాడొద్దని ఐఏఎఫ్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నుంచి మిగ్-21(MIG – 21) యుద్ధవిమానాలకు దశల వారీగా తొలగించనున్నట్లు తెలిపింది.
MiG -21 | తేజస్తో భర్తీ
మిగ్–21 యుద్ధ విమానాలను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. సుమారు 62 ఏళ్లుగా ఇవి భారత్కు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం భారత వైమానిక దళంలో 36 మిగ్ –21 విమానాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు ఇవి భారత గగనతల రక్షణలో కీలక పాత్ర పోషించాయి. 1963లో మొదటి సారి భారత్లోకి మిగ్ 21 వచ్చింది. తర్వాత సుఖోయ్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసే వరకు మిగ్–21 విమానాలు భారత వైమానిక దళంలో అనేక సేవలు అందించాయి.
మిగ్–21 యుద్ధ విమానాల(MIG – 21 Fighter Jets) స్థానాన్ని స్వదేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ భర్తీ చేయాలని ఐఏఎఫ్ యోచిస్తోంది. మిగ్21 విమానం చివరిసారిగా రాజస్థాన్‌లోని బార్మర్ నుంచి 2023లో ఎగిరింది. వీటి స్థానంలో లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ జెట్(Light Combat Aircraft Jet)లను వినియోగిస్తామని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి(Air Chief Marshal VR Chowdhury) వెల్లడించారు.
MiG -21 | ఆ యుద్ధాల్లో కీలక పాత్ర
భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన 1965 యుద్ధం, బంగ్లాదేశ్ విముక్తి సమయంలో 1971 జరిగిన యుద్ధంలో మిగ్–21 విమానాలు కీలక పాత్ర పోషించాయి. 1999 కార్గిల్ యుద్దం, 2019 బాలకోట్ వైమానిక దాడుల్లో సైతం ఇవీ సేవలు అందించాయి. మిగ్ 21 యుద్ధ విమానాలను భారత్ మొదట రష్యా నుంచి కొనుగోలు చేసింది. అనంతరం సాంకేతిక బదిలీ చేయడంతో 600 విమానాలు భారత్లోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (Hindustan Aeronautics Limited) తయారు చేసింది.