More
    HomeజాతీయంINS Vikrant | శత్రువులకు సింహస్వప్నం.. ఐఎన్ఎస్ విక్రాంత్

    INS Vikrant | శత్రువులకు సింహస్వప్నం.. ఐఎన్ఎస్ విక్రాంత్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: INS Vikrant | పహల్​గామ్​ ఉగ్రదాడి (Pahalgam terror attack)తో భారత్, పాకిస్తాన్(Ind – Pak) మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో దాయాదికి ఊహించని రీతిలో దెబ్బ కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మరోసారి ఉగ్రదాడులు చేయాలంటే భయపడేలా నలువైపులా నుంచి పాక్​ను దిగ్బంధనం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఇటు నేవీ, అటు ఎయిర్​ఫోర్స్, మరోవైపు సైన్యాన్ని సన్నద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఐఎన్ఎస్ విక్రాంత్ ను రంగంలోకి దింపి పాక్ లోని కరాచి పోర్టుపై భీకర దాడులు చేసింది.

    INS Vikrant | తిరుగులేని శక్తి..

    పాకిస్తాన్​తో ఉద్రిక్తతల వేళ భారత నౌకాదళం(Indian Navy) ఐఎన్ఎస్ విక్రాంత్​ను అరేబియా సముద్రం(Arabian Sea)లో మోహరించింది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ విమాన వాహక నౌకను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2022న జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం ఈ నౌక పహారా కర్ణాటకలోని కర్వార్ తీరంలో కాస్తోంది. 262 మీటర్ల పొడవు, 45 వేల టన్నుల బరువు కలిగి ఉన్న ఈ నౌక.. 28 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. పాక్​లోని కరాచీ, గ్వాదర్ వంటి ఓడరేవులను విక్రాంత్ సులభంగా విధ్వంసం చేయగలదు. ఈ విమాన వాహక నౌకలో మిగ్-29కే యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇది పాకిస్తాన్ నౌకాదళాన్ని బలహీనపరచడంతో పాటు 60శాతం వరకు సముద్ర మార్గాలను అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉంది.

    READ ALSO  Railway Passengers | ఆర్వోబీ వద్ద విరిగిన క్లస్టర్​.. నిలిచిపోయిన పలు రైళ్లు

    రూ.20 వేల కోట్లతో నిర్మించిన ఈ విమాన వాహక నౌకలో 30 యుద్ధ విమానాలను నిలిపేంత విశాలస్థలం ఉంటుంది. 262 మీటర్ల పొడవు, 45 వేల టన్నుల సామర్థ్యం కలిగిన ఈ నౌకపై మిగ్-29(MIG-29K)కే ఫైటర్ జెట్లు, 32 కమోవ్చ ఎంహెచ్-60 ఆర్ హెలికాప్టర్లు, దేశీయంగా తయారైన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు (ఏఎల్హెచ్), లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎల్సీఏ) విమానాలతో సహా 30 రకాల విమానాలను మోసుకెళ్లేలా దీన్ని రూపొందించారు. ఈ యుద్ధనౌకలో మొత్తం 18 డెక్లు, 2,400 గదులు ఉండగా, 1,600 మంది సైనికులు పని చేస్తారు. భారత్ వద్ద ప్రస్తుతం రెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి. ఒకటి విక్రమాదిత్య, మరొకటి విక్రాంత్. ఈ నౌకలను హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో భద్రతా ప్రయోజనాల కోసం వినియోగిస్తారు.

    READ ALSO  Tamil Nadu | ఆస్తులు కావాలని వేధించిన కుమార్తెలు.. రూ.నాలుగు కోట్ల విలువైన ఆస్తిని ఆలయానికి విరాళం ఇచ్చిన తండ్రి..

    INS Vikrant | గతంలో పాక్​పై నేవీ ఆధిపత్యం..

    భారత్​లో నిర్మించిన స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన ఈ నౌకకు 1971లో పాకిస్తాన్​తో యుద్ధంలో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఐఎన్ఎస్ విక్రాంత్(INS Vikrant) పేరే పెట్టారు. నాటి యుద్ధంలో పాక్​ను చావుదెబ్బ కొట్టిన ఘనత ఐఎన్ఎస్ విక్రాంత్(INS Vikrant)​కు ఉంది. మన దేశంపై దాడి చేసేందుకు యత్నించిన పాక్.. విక్రాంత్​ను టార్గెట్​గా చేసుకుంది. దీన్ని గుర్తించిన ఇండియన్ నేవీ(Indian Navy) పాక్​ను ఏమార్చింది. వైజాగ్​లో ఉన్న మరో వాహక నౌకను విక్రాంత్​గా శత్రువులు పొరబడేలా కొన్ని టెక్నికల్ ఇండికేషన్స్​తో ఏమార్చింది. విక్రాంత్​పై దాడి చేసేందుకు పాకిస్తాన్ తన అత్యాధునికమైన ఘాజీని పంపించింది. ఇది గమనించిన ఇండియన్ నేవీ రెండు బాంబులతో ఘాజీని సముద్ర గర్భంలోనే కలిపేసింది.

    READ ALSO  Chhattisgarh | భార్య వేధింపులకు మరో వ్యక్తి బలి.. తన ఆవేదనను వీడియో తీసి సూసైడ్​..

    Latest articles

    Media | పెరిగిన విష సంస్కృతి.. మీడియాపై దాడి.. ఉన్మాద స్థాయికి దిగజారిన రాజకీయాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Media : ప్రజాస్వామ్యం(democracy)లో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా సంస్థలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. రాజకీయ,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 29 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – ఆదివారంమాసం – ఆషాఢపక్షం...

    ENG-W vs IND-W | స్మృతి మంధాన అద్భుత సెంచరీ.. మహిళల T20I లో సెంచరీ సాధించిన రెండో భారతీయురాలిగా రికార్డు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ENG-W vs IND-W : నాటింగ్‌హామ్‌లో శనివారం(జూన్ 28) జరిగిన మహిళల ఇంగ్లండ్​(England) వర్సెస్​ టీమిండియా(Team...

    Russia | శిక్షణ విమానం కూలిపోయి నలుగురి దుర్మరణం.. మాస్కో సమీపంలో ఘటన

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Russia : మాస్కో(Moscow) ప్రాంతంలోని కొలోమ్నా జిల్లాలో శనివారం (జూన్ 28) తేలికపాటి శిక్షణ విమానం...

    More like this

    Media | పెరిగిన విష సంస్కృతి.. మీడియాపై దాడి.. ఉన్మాద స్థాయికి దిగజారిన రాజకీయాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Media : ప్రజాస్వామ్యం(democracy)లో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా సంస్థలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. రాజకీయ,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 29 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – ఆదివారంమాసం – ఆషాఢపక్షం...

    ENG-W vs IND-W | స్మృతి మంధాన అద్భుత సెంచరీ.. మహిళల T20I లో సెంచరీ సాధించిన రెండో భారతీయురాలిగా రికార్డు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ENG-W vs IND-W : నాటింగ్‌హామ్‌లో శనివారం(జూన్ 28) జరిగిన మహిళల ఇంగ్లండ్​(England) వర్సెస్​ టీమిండియా(Team...