అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ballistic missiles | పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో భారత్ నిర్వహించిన కీలక బాలిస్టిక్ క్షిపణుల (ballistic missiles) ప్రయోగం విజయవంతమైంది. స్వల్ప-శ్రేణి అణ్వస్త్ర సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలు నిర్వహించింది.
ఒడిశా, చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ 2 (350-కిమీ స్ట్రైక్ రేంజ్), అగ్ని–1 (700-కిమీ) టార్గెట్‌ను ఛేదించాయి. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (SFC) (Strategic Forces Command) ఆధ్వర్యంలో వీటి పరీక్ష జరిగింది. పృథ్వీ-2 (Prithvi-2), అగ్ని-1లు (Agni-1) ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్‌ను అందుకున్నాయి. దీంతో పరీక్ష విజయవంతం అయింది. “ఈ ప్రయోగాలు అన్ని కార్యాచరణ, సాంకేతిక పారామితులను అధిగమించాయని” రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Ballistic missiles | పాక్‌ను దెబ్బతీసే క్షిపణులు..
దేశ అణ్వాయుధ సామగ్రిని నిర్వహించడానికి 2003లో స్థాపించిన SFC ఆధ్వర్యంలో ఒకే రోజు రెండు అణ్వస్త్ర సామర్థ్యం గల క్షిపణులను కలిపి పరీక్షించడం ఇదే మొదటిసారి. ఈ రెండు క్షిపణులు పాకిస్తాన్‌ను దారుణమైన దెబ్బ కొట్టగల సామర్థ్యం కలిగినవి. అయితే అగ్ని-2 (2,000-కిమీ), అగ్ని-3 (3,000-కిమీ), నియర్ ఐసీబీఎం (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి) అగ్ని-5 (5,000-కిమీ కంటే ఎక్కువ) వంటివి ఎక్కువగా చైనా వైపు దృష్టి సారించాయి.
DRDO, SFC నూతన తరం అగ్ని-ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి (Agni-Prime ballistic missile) ప్రీ-ఇండక్షన్ నైట్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి, ఇది 1,000 నుంచి 2,000-కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది క్రమంగా దేశ అణు ఆయుధశాలలోని అగ్ని-1, అగ్ని-2 క్షిపణులను భర్తీ చేస్తుంది.
Ballistic missiles | పృథ్వీ 2 మిస్సైల్ ప్రత్యేకతలు
భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (India Defence Research and Development Organisation) ఇది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ దీనిని వాడుతుంది. ఈ క్షిపణి రేంజ్ 350 కిలోమీటర్లు. 500 నుంచి 1000 కిలోల బరువును మోసుకెళ్లగలదు.
Ballistic missiles | అగ్ని 1 మిస్సైల్ ప్రత్యేకతలు
స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని-1 మిస్సైల్‌ను కూడా భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది. ఈ క్షిపణి రేంజ్ 700 నుంచి 900 కిలోమీటర్లు. ఇది వెయ్యి కిలోల యుద్ధ సామాగ్రిని మోసుకెళ్లగలదు. తక్కువ లోడు ఉంటే ఏకంగా 1200 కిలోమీటర్లు దూసుకెళ్లగలదు.
Ballistic missiles | అగ్రి ప్రైమ్ పరిధిలోకి చైనా ఉత్తర ప్రాంతాలు..
అగ్ని-ప్రైమ్ కూడా అగ్ని-V లాంటి క్యానిస్టర్-లాంచ్ సిస్టమ్. ఇది చైనాలోని ఉత్తర ప్రాంతాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి. ఈ రెండూ కలిసి భారతదేశం యొక్క అణ్వస్త్ర నిరోధక స్థితికి అదనపు బలాన్ని చేకూర్చుతాయి. క్యానిస్టర్-లాంచ్ క్షిపణులు – వార్‌హెడ్‌లను సులభవంగా, వేగంగా రవాణా చేయడానికి అవకాశం ఉంది.
గతేడాది మార్చి 11న తొలిసారి అగ్ని-5ను బహుళ వార్‌హెడ్‌లతో (MIRVలు లేదా బహుళ స్వతంత్రంగా లక్ష్యంగా చేసుకోగల రీఎంట్రీ వాహనాలు) పరీక్షించారు. రానున్న రోజుల్లో ఈ MIRVed క్షిపణి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్వేరు లక్ష్యాల వద్ద మూడు నుంచి నాలుగు వార్‌హెడ్‌లను ప్రయోగించగలదు.