అక్షరటుడే, ఆర్మూర్: Sriramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 20 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్రలోని (Maharashtra) బాబ్లీ ప్రాజెక్టు(Babli Project) గేట్లు ఎత్తడంతో పాటు, ఇటీవల కురిసిన వర్షాలకు ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం జలాశయంలోకి 6,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. బుధవారం 4,291 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో ఉండగా.. గురువారం రోజు సుమారు రెండు వేల క్యూసెక్యుల వరద పెరిగింది.
Sriramsagar Project | ప్రస్తుతం 20 టీఎంసీల నిల్వ
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 20.006 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 12.324 టీఎంసీలు నిల్వ ఉంది. ప్రస్తుతం ఆవిరి రూపంలో 341 క్యూసెక్కులు పోతుండగా.. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 9.3 టీఎంసీల నీరు జలాశయంలోకి వచ్చి చేరగా.. 2.1 టీఎంసీలు దిగువకు వెళ్లాయి.
Sriramsagar Project | గతేడాది 293 టీఎంసీల ఇన్‌ఫ్లో
గతేడాది ఎగువ నుంచి 293 టీఎంసీల నీరు శ్రీరాంసాగర్‌లోకి (Sriramsagar Project) రాగా యాసంగి పంటలకు ప్రాజెక్ట్ పరిధిలోని 6,24,000 ఎకరాలకు 73 టీఎంసీల నీటిని అందించారు. మిగిలిన నీరు కాకతీయ, లక్ష్మి, సరస్వతి, వరద కాల్వల ద్వారా మల్లన్నసాగర్ (Mallanna sagar), మిడ్ మానేరు (Mid Manor)కు సాగు, తాగునీటిని అందించారు. మిగతా నీటిని నదిలోకి వదిలారు. ఈ యేడు సైతం ప్రాజెక్టులోకి 60 టీఎంసీల నీటినిల్వ అనంతరం ఖరీఫ్ పంటల సాగుకు నీటి విడుదల విషయమై ప్రాజెక్టు అధికారులు ప్రణాళికలు రూపొందించనున్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్తరవి తెలిపారు.