More
    Homeబిజినెస్​Influx Healthtech IPO | ఈ ఐపీవో అలాట్ అయితే జాక్​పాట్​ కొట్టినట్లే..! నేటినుంచి ఇన్‌ఫ్లక్స్‌...

    Influx Healthtech IPO | ఈ ఐపీవో అలాట్ అయితే జాక్​పాట్​ కొట్టినట్లే..! నేటినుంచి ఇన్‌ఫ్లక్స్‌ హెల్త్‌టెక్‌ ఐపీవో ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Influx Healthtech IPO | ఇన్‌ఫ్లక్స్ హెల్త్‌టెక్ (Influx healthtech) లిమిటెడ్ ఎస్‌ఎంఈ కంపెనీ ఐపీవోకు వచ్చింది. బుధవారం ఉదయం నుంచి సబ్‌స్క్రిప్షన్‌ మొదలు కానుంది.

    వివిధ రకాల ఇండస్ట్రీలకు చెందిన క్లయింట్స్‌కు ట్యాబ్లెట్లు(Tablets), క్యాప్సూల్స్, పౌడర్స్, లిక్విడ్ ఓరల్స్, సాఫ్ట్ జెల్స్(Soft gels) వంటి వివిధ ఉత్పత్తులను సరఫరా చేసే కంపెనీ అయిన ఇన్‌ఫ్లక్స్ హెల్త్‌టెక్ లిమిటెడ్ ఐపీవో(Influx healthtech IPO)కు వచ్చింది. 55.63 కోట్ల రూపాయలు సమీకరించాలని భావిస్తోంది. రూ. 10 ముఖ విలువ(Face value) కలిగిన 46.94 లక్షల కొత్త షేర్లను విక్రయించడం ద్వారా రూ. 45.07 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్(OFS) కింద రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 11 లక్షల షేర్లను విక్రయించడం ద్వారా మరో రూ. 10.56 కోట్లను సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కొత్త మ్యాన్‌ఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, కొత్త మిషనరీ కొనుగోలు చేయడానికి, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

    READ ALSO  Oil Reserves | అండమాన్​లో భారీగా చమురు నిల్వలు.. భారత్​పై తగ్గనున్న దిగుమతుల భారం

    Influx Healthtech IPO | సబ్‌స్క్రిప్షన్‌ డిటెయిల్స్‌..

    ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ (Subscription) బుధవారం ప్రారంభమవుతుంది. 20వ తేదీ వరకు బిడ్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంది. 23న అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ షేర్లు 25న ఎన్ఎస్ఈ(NSE)లో లిస్ట్ అవుతాయి.

    Influx Healthtech IPO | ప్రైస్ బ్యాండ్

    కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు(Equity share) ధరను రూ. 91 నుంచి రూ. 96 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 1,200 షేర్లున్నాయి. ఆసక్తిగలవారు రూ. 1,15,200లతో సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

    Influx Healthtech IPO | కోటా, జీఎంపీ..

    క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం, రిటెయిల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం వాటా కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) రూ. 40 ఉంది. అంటే ఐపీవోలో షేర్లు అలాట్‌ అయ్యేవారికి లిస్టింగ్‌ రోజే 41 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

    READ ALSO  Stock Market | భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Latest articles

    Sub Collector Kiranmai | రెవెన్యూ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

    అక్షరటుడే, నిజాంసాగర్: Sub Collector Kiranmai | రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును లోతుగా పరిశీలించి రైతులకు...

    Mla Dhanpal | కలెక్టర్​ను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే

    అక్షర టుడే, ఇందూరు: Mla Dhanpal | జిల్లా కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని (Collector...

    Telangana University | దోస్త్ ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ఆన్​లైన్​లో దోస్త్ ద్వారా...

    Rythu Bharosa | నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా జమ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rythu Bharosa | రాష్ట్రంలో అన్నదాతల (Farmers) పెట్టుబడి సాయం కింద రైతు భరోసా...

    More like this