అక్షరటుడే, వెబ్‌డెస్క్: YSRCP | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రాజకీయాలు రోజురోజుకు కాకరేపుతున్నాయి. ఇటీవల గుడివాడలో టీడీపీ వైసీపీ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (Nallapureddy Prasannakumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేత ప్రసన్నకుమార్‌రెడ్డి ఇటీవల కోవూరు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి (TDP MLA Prashanthi Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిపై స్పందిస్తూ వేమిరెడ్డి దంపతులే (Vemireddy Couple) తన ఇంటిపై దాడి చేయించారన్నారు. సాక్ష్యాలు, వీడియోలు చూపించినా పోలీసులు కేసు పెట్టడం లేదని ఆరోపించారు. తాను తలుచుకుంటే పది వేల మందితో వెళ్లి వేమిరెడ్డి ఇల్లు కూల్చి వారిని ఎత్తుకు రాగలనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
YSRCP | కేసు నమోదు
టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే ప్రసన్నకుమార్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు (Kovur Police) కేసు పెట్టారు. కాగా నియోజకవర్గంలోని పడుగుపాడులో జరిగిన వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో నల్లపరెడ్డి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పేర్ని నాని సైతం కార్యకర్తల సమావేశంలో కన్ను కొడితే పని అయిపోవాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కార్యకర్తలను రెచ్చగెట్టేలా మాట్లాడారని ఆయనపై కూడా కేసు నమోదైంది.