అక్షరటుడే, వెబ్డెస్క్: Collector slap student | మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) భిండ్ జిల్లాలో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగిన ఘటనపై తీవ్ర దుమారం రేగుతోంది.
జిల్లా కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ్ (District Collector Sanjeev Srivastava), బీఎస్సీ రెండో సంవత్సరం గణిత పరీక్షలో (B.Sc second year mathematics exam) మోసం జరుగుతుందనే అనుమానంతో కాలేజీకి స్వయంగా వెళ్లి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియోల ప్రకారం.. పరీక్ష సమయంలో అనుమానంతో ఓ విద్యార్థిని ఎంచుకొని, తానే స్వయంగా కొట్టడం జరిగిందని అంటున్నారు. వీడియోలు బయటకు వచ్చిన తరువాత ఆయన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Collector slap student | ఏంటి.. ఈ దారుణం..
ఎలాంటి ఆధారాలు లేకుండానే విద్యార్థిపై శారీరక దాడికి దిగడాన్ని న్యాయవాదులు, విద్యావేత్తలు ఖండిస్తున్నారు. ఈ వ్యవహారంపై కొందరు సర్కాస్టిక్‌గా స్పందిస్తూ.. “విద్యార్థిని Student కాల్చమని గన్‌మన్‌కి ఆదేశించకుండా, కేవలం కొట్టడంతో సరిపెట్టినందుకు ధన్యవాదాలు చెప్పాలి” అంటూ వ్యాఖ్యానించారు.
ఇదే కాకుండా, “ప్రజల సేవ చేయాలనుకున్న అధికారి ఇదేనా ప్రవర్తన?” అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు ఈ ఘటనపై ప్రభుత్వం గాని, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Chief Minister Mohan Yadav) గాని స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం.. సదరు అధికారికి అవార్డు ఇవ్వాలని కొందరు వ్యంగ్యంగా పోస్ట్‌లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని, అధికారులు అధికారం ఎలా ఉపయోగించాలో అనే విషయంపై తీవ్ర చర్చ మొదలైంది. బాధిత విద్యార్థి కుటుంబం ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు (Police complaint) చేసినట్లు సమాచారం లేదు. కానీ ఈ వ్యవహారంపై మానవ హక్కుల సంఘాలు స్పందించే అవకాశముంది. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.