అక్షరటుడే, వెబ్‌డెస్క్: Formula E Race Case | సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (IAS officer Arvind Kumar) గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో ఏసీబీ ఆయనను ప్రశ్నిస్తోంది. ఇటీవల ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను (KTR) అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్‌కుమార్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Formula E Race Case | వేగం పెంచిన ఏసీబీ
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ వేగం పెంచింది. హైదరాబాద్‌లో (Hyderabad) నిర్వహించిన ఫార్ములా ఈ-కారు రేసులో (Formula E car race) అక్రమాలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేబినెట్ ఆమోదం లేకుండానే అప్పటి మంత్రి కేటీఆర్ నిధులు కేటాయించారని ఏసీబీ పేర్కొంటుంది. నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని కేసు నమోదు (Case Registered) చేసి విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో ఫార్ములా ఈ రేసులో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అరవింద్‌కుమార్‌ను మరోసారి ప్రశ్నిస్తోంది.
Formula E Race Case | విదేశాల్లో ఉండడంతో ఆలస్యం
ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను (IAS officer Arvind Kumar) జులై 1న విచారణకు రావాలని ఏసీబీ గతంలో నోటీసులు (ACB notices) ఇచ్చింది. అయితే ఆయన విదేశాల్లో ఉండడంతో విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో బుధవారం మళ్లీ నోటీసులు ఇచ్చారు. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అంశాలపై అరవింద్‌కుమార్ క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు.