అక్షరటుడే, న్యూఢిల్లీ: I Am Hind : పహల్గావ్ లో హిందువులనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్చి చంపారు. పర్యాటకులను హిందువులుగా నిర్ధారించుకోవడానికి ముష్కరులు వికృతంగా ప్రవర్తించారు. కల్మా చదవమన్నారు. హిందువులను నిర్ధారించుకుని మరీ విచక్షణా రహితంగా కాల్చిచంపారు. ఇలాంటి తరుణంలో దేశవ్యాప్తంగా హిందువులంతా ఏకమవుతున్నారు. ముఖ్యంగా వారణాసిలో ధైర్యంగా బయటకి వస్తున్నారు. తాము హిందువులమంటూ చేతిపై కాషాయ జెండాతో సహా టాటూ వేయించుకుని సవాలు విసురుతున్నారు.
పూర్వం ప్రజలు శరీరం మీద పచ్చబొట్టు వేయించుకునేవారు. ఇప్పుడు దాని స్థానంలో టాటూలు tatto వచ్చాయి. గత కొన్నేళ్లుగా టాటూల సంస్కృతి పెరిగింది. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గావ్లో జరిగిన ఉగ్రదాడి ఘటన తర్వాత.. ’హిందూ’ HINDU అనే పదంతో టాటూలు వేయించుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.
వారణాసిలో varanasi హిందూ పదాన్ని టాటూ వేయించుకునే వారిని టాటూయిస్టులు Tattooists సైతం ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు 50% తగ్గింపును అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఉత్తర్ప్రదేశ్ Uttar Pradesh లోని వారణాసి జిల్లాలో భారీగా టాటూ స్టాల్స్, షాపులు ఉన్నాయి. ఇప్పుడు వాటి వద్ద రద్దీ నెలకొంది. అత్యధికంగా హిందూ అనే పదాన్ని చేతులపై టాటూగా వేయించుకోవడానికి వస్తున్నారు.
వారణాసి Varanasi లోని పాండే ఘాట్ Pandey Ghat లో ఉండే ఓ టాటూ ఆర్టిస్టు మాట్లాడుతూ.. హిందూ అనే పదాన్ని టాటూగా వేయించుకోవడానికి నిత్యం తన వద్దకు 25 నుంచి 30 మంది వస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది ఈ టాటూను వేయించుకునేలా తాము హిందూ టాటూల Hindu tattoos పై 50% తగ్గింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
శివ్‌పూర్ నివాసి ఒకరు మాట్లాడుతూ.. పహల్గావ్ Pahalgaon లో ఉగ్రవాదులు మతం అడిగి మరీ పర్యాటకుల tourists ను చంపేశారు.. మా మతం ఏమిటని అడగాల్సిన అవసరం లేదు. అందరికీ స్పష్టంగా తెలిసేలా చేతులపై హిందూ అనే పదాన్ని రాయించుకుంటున్నామని వివరించారు.