అక్షరటుడే, హైదరాబాద్: Hydraa Police Station : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్న హైడ్రా.. ఇప్పటికే ప్రతి సోమవారం ప్రజావాణిని నిర్వహిస్తోంది. సమస్యలు ఉన్నవారు క్యూ కడుతున్నారు. భాగ్యనగరం ప్రజలకు సేవలు అందించేందుకు తాజాగా హైడ్రా మరో అడుగు ముందుకు వేసింది. నేటి నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రాబోతోంది. రాణిగంజ్‌లోని బుద్ధభవన్ సమీపంలో దీనిని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు.
