అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad city) నగరంలో వరద ముంపు నియంత్రణే లక్ష్యంగా హైడ్రా చర్యలు చేపడుతోంది. నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమంగా నాలాలు, చెరువులను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తోంది. దీంతో ఆక్రమణదారులు ఆందోళన చెందుతున్నారు.
కూకట్‌పల్లి (Kukatpally Area) పరిధిలోని హబీబ్‌నగర్‌లో శుక్రవారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. నాలా ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు (Hydraa Officerrs) తొలగించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.
Hydraa | ప్రజావాణి ద్వారా ఫిర్యాదులు
నగరంలో ఆక్రమణలను కూల్చివేసి, ప్రభుత్వ భూములను సంరక్షించడానికి హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. తమ ప్రాంతాల్లో నాలాలు, చెరువులు, పార్కుల కబ్జాపై ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. అనంతరం అధికారులు విచారణ జరిపి ఆక్రమణలు నిజమని తేలితే నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇటీవల హైడ్రా పలు పార్కులను కాపాడింది.
Hydraa | నాలాలపై కమిషనర్ ఫోకస్
ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో హైడ్రా కమిషనర్ రంగానాథ్ నాలాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నాలాల ఆక్రమణలను తొలగించడంతో పాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు విస్తరించాలని ఆయన సూచించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులకు సూచనలు చేశారు. అంతేగాకుండా ఆయన నిత్యం నాలాలను పరిశీలిస్తున్నారు. పూడికతీత పనులు సైతం వేగవంతం అయ్యేలా చొరవ చూపుతున్నారు.