అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Metro : తెలంగాణ రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్ మెట్రో hyderabad metro నష్టాల్లో నడుస్తోంది. ఎల్ అండ్ టీ l&t ఆధ్వర్యంలోని హైదరాబాద్ మెట్రో రైల్ (HMRL) ప్రజా రవాణాలో మంచి గుర్తింపు పొందినా, ప్రారంభం మంచి ఈ సంస్థ నష్టాలనే చవిచూస్తున్నట్లు చెబుతోంది.
2017లో ప్రారంభమైన మెట్రో.. నాటి నుంచి నేటి వరకు రూ.6598.21 కోట్లు నష్టపోయినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ (HMRL) వెల్లడించింది. సర్వీస్ విషయంలో హైదరాబాద్ ప్రజల hyderabad City ఆదరణ పొందిన మెట్రో.. కొవిడ్ కాలంలో ఏడాది పాటు ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మరింత కుదేలయినట్లు చెబుతోంది.
ఈ ఏడాది (2024 -25) కాలంలో రూ.625 కోట్ల నష్టాన్ని చవిచూసినట్లు పేర్కొంది. 2025 మొదటి క్వార్టర్ లోనూ రూ.5.55 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నట్లు చెబుతోంది.